AP BJP: భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు తొలగింపు

ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తొలగించారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు ఫోన్‌ చేసి తెలిపారు.

Updated : 04 Jul 2023 14:39 IST

అమరావతి: ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తొలగించారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు ఫోన్‌ చేసి తెలిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని నడ్డా ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై సోము వీర్రాజు ఇంకా స్పందించలేదు. 1978 నుంచి సోము వీర్రాజు భాజపాలో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో 2020 జులై 27న ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఏపీ అధ్యక్షుడిని మార్చాలని భాజపా అధినాయకత్వం భావిస్తున్నట్లు గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.  దీంతో పాటు సోము వీర్రాజుపై రాష్ట్రానికి చెందిన కొంతమంది నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు కొన్ని రోజులుగా కేంద్రమంత్రివర్గంలో మార్పులు చేర్పులు.. వివిధ రాష్ట్రాల అధ్యక్షుల మార్పుపై భాజపా అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఏపీలో మరో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడితోనే ఎన్నికలకు వెళ్లాలని భాజపా అధినాయకత్వం భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోము వీర్రాజును తప్పించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర భాజపాకు కొత్త అధ్యక్షుడిని సాయంత్రం లేదా రేపు ప్రకటించే అవకాశముంది.     


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని