LS Polls: బెంగాల్‌లో టీఎంసీ జాబితా.. యూసుఫ్‌ పఠాన్‌, నటి రచనకు ఛాన్స్‌

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 స్థానాలకుగానూ టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ అభ్యర్థులను ప్రకటించారు.

Updated : 10 Mar 2024 16:23 IST

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ (TMC) సమర శంఖాన్ని పూరించింది. ‘ఇండియా’ కూటమిలో భాగమైనప్పటికీ.. రాష్ట్రంలో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. మొత్తం 42 స్థానాలకుగానూ అభ్యర్థులను ప్రకటించారు. కోల్‌కతా వేదికగా ఆదివారం పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

బహరామ్‌పుర్‌ నుంచి మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ బరిలో దిగనున్నారు. హుగ్లీ నుంచి నటి రచనా బెనర్జీకి అవకాశం కల్పించారు. ఆమె తెలుగులో బావగారు బాగున్నారా?, కన్యాదానం, మావిడాకులు చిత్రాల్లో నటించి మెప్పించారు. అవినీతి ఆరోపణలపై పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన మహువా మొయిత్రా మరోసారి కృష్ణానగర్‌ నుంచి పోటీ చేయనున్నారు. ఎనిమిది మంది సిటింగ్‌లను పక్కకు తప్పించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక స్థానం నుంచి పోటీకిగానూ సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో చర్చలు జరుపుతున్నట్లు మమతా తెలిపారు. అస్సాం, మేఘాలయాలోనూ పోటీ చేస్తామన్నారు.

‘ఎవరినో రక్షించడానికే ఎస్‌బీఐ ప్రయత్నం’ - కపిల్‌ సిబల్‌

రాష్ట్రంపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘నేను న్యాయ వ్యవస్థను గౌరవిస్తాను. కానీ, కొంతమంది భాజపా ఏజెంట్లుగా పనిచేశారు’’ అని కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయపై విరుచుకుపడ్డారు. ఆయన ఇటీవల భాజపాలో చేరిన విషయం తెలిసిందే.

టీఎంసీపై ఎలాంటి ఒత్తిడి ఉందో..: కాంగ్రెస్‌

‘‘పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ భాగస్వామ్యంతో గౌరవప్రదమైన స్థానాల్లో పోటీకి సీట్ల సర్దుబాటు జరగాలని కాంగ్రెస్ కోరుకుంది. ఈ విషయంలో చర్చలకు మా తలుపులు తెరచి ఉన్నాయని ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నాం. సీట్లపై ఏకపక్ష ప్రకటన ఉండకూడదు. తమిళనాడు, మహారాష్ట్ర, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ల మాదిరిగానే అందరం కలిసికట్టుగా నిర్ణయానికి రావాలి. టీఎంసీపై ఎలాంటి ఒత్తిడి ఉందో నాకు తెలియదు. మాకు సంబంధించినంతవరకు మేం బెంగాల్‌లో ‘ఇండియా’ కూటమిని బలోపేతం చేయాలనుకుంటున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని