TDP: తెదేపాలో చేరిన వైకాపా ఎంపీ మాగుంట

ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి తెదేపాలో చేరారు.

Updated : 16 Mar 2024 19:10 IST

అమరావతి: ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి తెదేపాలో చేరారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు కండువాకప్పి మాగుంటను తెదేపాలోకి ఆహ్వానించారు. వీరితో పాటు అద్దంకి వైకాపా నేతలు బాచిన కృష్ణచైతన్య, గరటయ్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి తెలుగుదేశంలో చేరారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయం తిరగబడిందని, దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు.

అధినేత ఆదేశాల మేరకు పని చేస్తా: వర్మ

చంద్రబాబుతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ అయ్యారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండటంతో వర్మతో మాట్లాడేందుకు చంద్రబాబు ఇంటికి పిలిపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. పవన్ గెలుపునకు సహకరిస్తానని వర్మ హామీ ఇచ్చారని చంద్రబాబు స్పష్టం చేశారు. సీటు త్యాగం చేసిన ఆయనకు మొదట విడతలో ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు. అధినేత ఆదేశాల మేరకు తాను పని చేస్తానని వర్మ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని