Virat Kohli: ‘మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముక.. ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు’

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ఆస్ట్రేలియా క్రికెటర్లు మాట్లాడారు.  

Updated : 07 Jun 2023 10:08 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC Final) ఫైనల్‌ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 7న లండన్‌లోని ఓవల్‌ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ మొదలవనుంది. ఇదిలా ఉండగా.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడనున్న ఆసీస్‌ క్రికెటర్లు కామెరూన్‌ గ్రీన్‌, స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌, పాట్ కమిన్స్‌, మిచెల్ స్టార్క్‌ మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ (ICC) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.  

‘‘విరాట్ కోహ్లీ చాలా కాలంపాటు ది మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా  ఉన్నాడు. గత దశాబ్దకాలం నుంచి జట్టులో కీలకంగా ఉంటున్నాడు. చాలా విజయవంతమయ్యాడు’’ -కామెరూన్‌ గ్రీన్‌

‘‘కోహ్లీ చాలా సుదీర్ఘకాలంపాటు సూపర్ స్టార్‌గా ఉన్నాడు. అతను ఆస్ట్రేలియాతో ఆడటాన్ని ఇష్టపడతాడు. మాపై నిలకడగా పరుగులు రాబడతాడు. కానీ, ఈ వారం (డబ్ల్యూటీసీ ఫైనల్‌లో) మేము అతనికి కళ్లెం వేస్తామని భావిస్తున్నా’’- స్టీవ్‌ స్మిత్

‘‘ప్రపంచంలో కవర్‌ డ్రైవ్‌ను అద్భుతంగా ఆడటం కోహ్లీకే సాధ్యం’’- డేవిడ్ వార్నర్ 

‘‘అన్ని ఫార్మాట్లలోని గొప్ప ఆటగాళ్లలో కోహ్లీ ఒకరు. ఈ వారం అతడు బాగా ఆడొద్దని కోరుకుంటున్నా’’- లబుషేన్

‘‘ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు. సుదీర్ఘకాలంపాటు ఆధిపత్యం చెలాయించాడు. మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముక’’- మిచెల్ స్టార్క్

‘‘మంచి ఆటగాడు. ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు’’- పాట్ కమిన్స్ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని