Australian cricketer: మెడకు తగిలిన బంతి.. మృత్యువుతో పోరాడి ఆసీస్‌ యువ క్రికెటర్ మృతి

Eenadu icon
By Sports News Team Updated : 30 Oct 2025 11:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. పదకొండేళ్ల కిందట ఫిల్‌ హ్యూస్‌ మైదానంలోనే కుప్పకూలిన ఉదంతం ఇప్పటికీ అక్కడి అభిమానులను కలవరపెడుతోంది. తాజాగా 17 ఏళ్ల ఓ యువ క్రికెటర్ ఇదేతరహాలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అయితే, అతడు రెండు రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నా ఫలితం లేకుండాపోయింది. 

మెల్‌బోర్న్‌కు చెందిన బెన్ అస్టిన్ టీ20 మ్యాచ్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. ట్రైనింగ్‌ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి మెడకు బలంగా తగిలింది. దీంతో అతడు కుప్పకూలిపోయాడు. సహచర క్రికెటర్లు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇది మంగళవారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు రోజులపాటు మృత్యువుతో పోరాడిన యువ క్రికెటర్‌ గురువారం ఉదయం ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. ప్రాక్టీస్‌ సమయంలోనూ అతడు తలకు హెల్మెట్‌ పెట్టుకొని ఉన్నట్లు అక్కడి క్రికెట్ వర్గాలు తెలిపాయి. 

‘‘బెన్ క్రికెట్‌ కాకుండా ఫుట్‌బాల్ మ్యాచులు ఆడేవాడు. బెన్ ఆకస్మిక మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. అతడి మృతి మా క్రికెట్ కమ్యూనిటీపై ప్రభావం చూపిస్తుంది. ఈ సందర్భంగా అందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సమయంలో బెన్ కుటుంబం గోప్యతకు భంగం కలిగించవద్దని కోరుతున్నాం’’ అని ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

Tags :
Published : 30 Oct 2025 10:17 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు