
Chris Gayle: గేల్ ఇప్పుడు ‘యూనివర్స్ బాస్’ కాదు!
ఇంటర్నెట్‌డెస్క్: వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్‌గేల్‌కు ‘యూనివర్స్ బాస్’ అనే ముద్దు పేరున్న సంగతి తెలిసిందే. దాన్ని ఎవరూ పెట్టకుండానే అతడే స్వయంగా ప్రకటించుకున్నాడు. దాంతో కొంతకాలంగా అతడిని సంబోధించే క్రమంలో చాలా మంది యూనివర్స్ బాస్‌గానే పిలుస్తున్నారు. అతడి బ్యాట్ మీద కూడా అలా యూనివర్స్ బాస్ అనే స్టిక్కర్ ఉంటుంది. అయితే, తాజాగా ఆస్ట్రేలియాతో ఆడిన మూడో టీ20లో గేల్ (67; 38 బంతుల్లో 4x4, 7x6) రెచ్చిపోయి ఆడాడు. దాంతో విండీస్ 3-0 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్ గెలుపొందింది.
కాగా, ఈ మ్యాచ్‌లో గేల్ ఉపయోగించిన బ్యాట్ మీద ‘యూనివర్స్ బాస్’ అని కాకుండా ‘ది బాస్’ అనే స్టిక్కర్ కనిపించింది. అందుకు సంబంధించిన పోస్టును ఓ ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్‌సైట్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ విషయంపై అతడిని వివరణ కోరగా.. తాను ‘యూనివర్స్ బాస్’గా చెలామణి అవ్వడం ఐసీసీకి ఇష్టంలేదని చెప్పాడు. అందువల్లే దాన్ని ‘ది బాస్’గా కుదించుకున్నట్లు వివరించాడు. ఆ వీడియోలో సంభాషణ ఇలా జరిగింది.
వ్యాఖ్యాత: నీ బ్యాట్‌పై ఏముంది?
క్రిస్ గేల్: ‘ది బాస్’ అని మాత్రమే ఉంది. ఎందుకంటే నేను యూనివర్స్ బాస్ అని పిలుచుకోవడం ఐసీసీకి ఇష్టం లేదు. అందుకే దాన్ని కుదించి ది బాస్‌గా పెట్టుకున్నా. నేనే బాస్.
వ్యాఖ్యాత: యూనివర్స్ బాస్‌పై ఐసీసీకి కాపీరైట్స్ ఉన్నాయా?
క్రిస్ గేల్: అవును. నేను కాపీరైట్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే సాంకేతికంగా క్రికెట్‌లో ఐసీసీయే బాస్. వాళ్లతో నేను పనిచేయను. ఐసీసీతో సంబంధం లేదు. బ్యాటింగ్‌లో నేనే బాస్.. అని ముగించాడు.
మరోవైపు, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హెన్రిక్స్ (33), కెప్టెన్ ఫించ్ (30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆపై ఛేదనకు దిగిన విండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 14.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి నికోలస్ పూరన్ (32*) సహకరించాడు. దాంతో కరీబియన్ జట్టు 5 టీ20ల సిరీస్‌ను ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది.