Umran Malik: ఉమ్రాన్‌ మాలిక్‌ వేగం పెరగాలంటే.. అక్తర్‌ కీలక సూచన ఇదే!

అత్యధిక వేగవంతమైన బంతిని సంధించాలంటే రనప్‌ చాలా కీలకమని పాక్‌ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌ వ్యాఖ్యానించాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ (Umran Malik) విషయంలో మార్చుకోవాల్సిన అంశం కూడా ఇదేనని చెప్పాడు.

Published : 19 Mar 2023 01:28 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఫాస్టెస్ట్‌ బౌలర్‌ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఉమ్రాన్ మాలిక్‌ (Umran Malik). ఐపీఎల్‌లో దూసుకొచ్చిన ఈ యువ కెరటం టీమ్‌ ఇండియాలో కూడా రాణిస్తున్నాడు. అయితే అంతర్జాతీయంగా ఆ స్థానం పాక్‌ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌దే. ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ 161.3 వేగంతో ఓ బంతిని సంధించి రికార్డు సాధించిన విషయం తెలిసిందే. తన పేరిట ఉన్న ఆ రికార్డును ఉమ్రాన్‌ మాలిక్‌ను అధిగమిస్తే ఆనందమేనని షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. దాంతోపాటు ఉమ్రాన్‌కు కొన్ని కీలక సూచనలు కూడా చేశాడు. అన్నట్లు ఉమ్రాన్‌ ఇప్పటివరకు వేసిన వేగవంతమైన బంతి 155 కి.మీ.

రనప్‌ గురించి షోయబ్‌ మాట్లాడుతూ... ‘‘నేను బంతిని వేయడానికి దాదాపు 26 అడుగుల దూరం నుంచి పరిగెత్తేవాడిని. కానీ, ఉమ్రాన్‌ 20 అడుగుల నుంచే ప్రారంభిస్తున్నాడు. ఇంకాస్త దూరం వెళ్తే తన వేగంలో తప్పకుండా మార్పు వస్తుంది’’ అని సూచించాడు. అంతేకాదు తన రికార్డును బద్దలు కొట్టాలంటే రనప్‌లో కచ్చితంగా మార్పు చేయాల్సిందే అని చెప్పాడు. 20 అడుగుల నుంచి పరిగెత్తుకొని వచ్చి బంతిని విసిరితే అది సాధ్యం కాదు అని  తేల్చేశాడు.

ఉమ్రాన్‌ 20 అడుగుల రూల్‌ను బ్రేక్‌ చేసి... ఆ తర్వాత నా రికార్డును బ్రేక్‌ చేయాలని కోరుతున్నా. అలా అత్యధిక వేగవంతమైన బౌలర్‌గా ఉమ్రాన్‌ అవతరిస్తే తొలుత నేనే హత్తుకుని ముద్దాడతా. నిజానికి ఉమ్రాన్‌ బౌలింగ్‌ రనప్‌ చాలా బాగుంది. అతడి మోచేతి వేగం అద్భుతం. వికెట్లు రాకపోయినా సరే, బంతి వేగం మాత్రం తగ్గకూడదు. ఎప్పుడూ బంతిని వేగంగా వేయడానికే మొగ్గు చూపాలి. దాని కోసం మరింత శ్రమించాలి

- షోయబ్‌ అక్తర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని