Football : ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌పై ఫిఫా సస్పెన్షన్‌ వేటు

ఆల్‌ఇండియా ఫుట్‌బాట్‌ ఫెడరేషన్‌(ఏఐఎఫ్‌ఎఫ్‌) పై ఆ క్రీడ అత్యున్నత సంస్థ ఫిఫా చర్యలు చేపట్టింది. ఏఐఎఫ్‌ఎఫ్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని

Published : 16 Aug 2022 10:26 IST

భారత్‌లో ఫిఫా యు-17 మహిళల ప్రపంచకప్‌కు ముప్పు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆల్‌ఇండియా ఫుట్‌బాట్‌ ఫెడరేషన్‌(ఏఐఎఫ్‌ఎఫ్‌) పై ఆ క్రీడ అత్యున్నత సంస్థ ఫిఫా చర్యలు చేపట్టింది. ఏఐఎఫ్‌ఎఫ్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఫిఫా కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. తృతీయ పక్షం జోక్యం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఆ పక్షాలు ఫిఫా నిబంధనలు తరచూ ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది. 

ఫిఫా భారత్‌లో నిర్వహించతలపెట్టిన యు-17 (అండర్‌-17) మహిళల ప్రపంచ కప్‌ నిర్వహణలో కూడా ఇబ్బందులు తలెత్తనున్నాయి. భారత్‌లో 2022 అక్టోబర్‌ 11-30 మధ్యలో నిర్వహించ తలపెట్టిన ఈ టోర్ని కూడా  ముందుగా అనుకొన్నట్లు జరగదని ఫిఫా కౌన్సిల్‌ పేర్కొంది.  ఈ టోర్నీకి సంబంధించి అవసరమైతే తదుపరి చర్యల కోసం తగిన సమయంలో ఫిఫా బ్యూరో ఆఫ్‌ కౌన్సిల్‌కు రిఫర్‌ చేస్తామని హెచ్చరించింది. 

భవిష్యత్తులో ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ అధికారాలను చేపట్టేందుకు అడ్మిన్‌స్ట్రేటర్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఉపసంహరించుకొన్నాకే.. ఈ సస్పెన్షన్‌ ఎత్తివేస్తామని ఫిఫా పేర్కొంది. తాము భారత యువజన సర్వీసులు, క్రీడా శాఖతో సంప్రదింపులు జరుపుతుంటామని పేర్కొంది. సానుకూల ఫలితాలు వెలువడవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని