ICC: శామ్యూల్స్‌పై ఆరేళ్ల నిషేధం

వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు మార్లాన్‌ శామ్యూల్స్‌పై ఐసీసీ వేటు వేసింది. మూడు ఫార్మాట్ల క్రికెట్లో పాల్గొనకుండా శామ్యూల్స్‌పై ఆరేళ్ల నిషేధం విధించింది.

Updated : 24 Nov 2023 06:47 IST
దుబాయ్‌: వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు మార్లాన్‌ శామ్యూల్స్‌పై ఐసీసీ వేటు వేసింది. మూడు ఫార్మాట్ల క్రికెట్లో పాల్గొనకుండా శామ్యూల్స్‌పై ఆరేళ్ల నిషేధం విధించింది. అబుదాబి టీ10 లీగ్‌లో తాను పొందిన ప్రయోజనాల్ని వెల్లడించడంలో విఫలమవడం, సమాచారాన్ని దాచిపెట్టడం, దర్యాప్తు అధికారికి సహకరించనందుకు శామ్యూల్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. 2019 అబుదాబి టీ10 లీగ్‌లో శామ్యూల్స్‌పై ఈ ఆరోపణలు నమోదయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్‌ ఈ ఏడాది ఆగస్టులో అతడిని దోషిగా నిర్ధారించింది. అతనిపై ఆరేళ్ల నిషేధం ఈనెల 11 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఐసీసీ పేర్కొంది. విండీస్‌ తరఫున శామ్యూల్స 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20లు ఆడాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని