Sarfaraz Khan: ఆ షాట్‌ ఎందుకు సర్ఫ్‌రాజ్‌?

చక్కగా కుదురుకుని అర్ధసెంచరీ చేసిన తర్వాత ఓ చెత్త షాట్‌ ఆడి ఎందుకు ఔటయ్యావని భారత యువ బ్యాటర్‌ సర్ఫ్‌రాజ్‌ఖాన్‌ను దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ ప్రశ్నించాడు.

Updated : 09 Mar 2024 07:14 IST

ధర్మశాల: చక్కగా కుదురుకుని అర్ధసెంచరీ చేసిన తర్వాత ఓ చెత్త షాట్‌ ఆడి ఎందుకు ఔటయ్యావని భారత యువ బ్యాటర్‌ సర్ఫ్‌రాజ్‌ఖాన్‌ను దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ ప్రశ్నించాడు. ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టులో రెండో రోజు 56 పరుగులతో టీ విరామానికి వెళ్లిన సర్ఫ్‌రాజ్‌.. బ్రేక్‌ తర్వాత ఆడిన తొలి బంతినే కట్‌ షాట్‌ కొట్టబోయి ఔటైన నేపథ్యంలో సన్నీ ఇలా స్పందించాడు. ‘‘బంతి కట్‌ షాట్‌ ఆడేందుకు అనువుగానే పడకపోయినా.. దాన్ని వెంటాడి సర్ఫరాజ్‌ మూల్యం చెల్లించుకున్నాడు. విరామం తర్వాత తిరిగొచ్చినప్పుడు షాట్లు ఆడేందుకు కాస్త సమయం తీసుకోవాలి. ‘నేను 200 పరుగులు చేసినా.. ఆ తర్వాత బంతిని ఎదుర్కొనేటప్పుడు సున్నా దగ్గరే ఉన్నా అనుకుంటా’ అన్న దిగ్గజ డాన్‌ బ్రాడ్‌మ్యాన్‌ మాటలను గుర్తు చేసుకోవాలి’’ అని సన్నీ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని