నేడు ఉగాండాతో యువ భారత్‌ ఢీ

కరోనా కారణంగా కెప్టెన్‌తో సహా ఆరుగురు ఆటగాళ్లు మ్యాచ్‌కు దూరమైనప్పటికీ అందుబాటులో ఉన్న జట్టుతోనే ఐర్లాండ్‌పై అద్భుత విజయం సాధించిన యువ భారత్‌ మరో పోరుకు సిద్ధమైంది. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఇప్పటికే క్వార్టర్స్‌లో

Published : 22 Jan 2022 03:36 IST

సాయంత్రం 6.30 నుంచి

తరౌబ: కరోనా కారణంగా కెప్టెన్‌తో సహా ఆరుగురు ఆటగాళ్లు మ్యాచ్‌కు దూరమైనప్పటికీ అందుబాటులో ఉన్న జట్టుతోనే ఐర్లాండ్‌పై అద్భుత విజయం సాధించిన యువ భారత్‌ మరో పోరుకు సిద్ధమైంది. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఇప్పటికే క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన టీమ్‌ఇండియా.. శనివారం గ్రూప్‌- బిలో తమ చివరి మ్యాచ్‌లో ఉగాండాతో తలపడుతుంది. ఓపెనర్లు హర్నూర్‌, రఘువన్షీతో పాటు తాత్కాలిక కెప్టెన్‌ నిశాంత్‌, ఆల్‌రౌండర్లు రాజ్‌వర్ధన్‌, రాజ్‌ బవా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలోనూ కెప్టెన్‌ యశ్‌తో పాటు ఆంధ్ర కుర్రాడు రషీద్‌, ఆరాధ్య యాదవ్‌, మానవ్‌, సిద్ధార్థ్‌ పాజిటివ్‌లుగా తేలారు. దీంతో వీళ్లు ఉగాండాతో మ్యాచ్‌కు దూరం కానున్నారు. వాసు ఫలితం మాత్రం నెగెటివ్‌గా వచ్చినట్లు సమాచారం.  

క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌: అండర్‌-19 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ జట్లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. గ్రూప్‌- ఎలో ఇంగ్లాండ్‌ 189 పరుగుల తేడాతో యూఏఈని చిత్తుచేసింది. కెప్టెన్‌ టామ్‌ (154) శతకం సాయంతో ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు చేసింది. ఛేదనలో యూఏఈ 38.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. రెహాన్‌ (4/30) రాణించాడు. గ్రూప్‌- సి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 24 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌పై గెలిచింది. మరోవైపు కెనడాపై 8 వికెట్ల తేడాతో నెగ్గిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బంగ్లాదేశ్‌ క్వార్టర్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని