ICC Rules: క్రికెట్‌లో కొత్త నిబంధనలు తీసుకొచ్చిన ఐసీసీ.. అవేంటంటే?

క్రికెట్‌ను రసవత్తరంగా మార్చేందుకు ఐసీసీ (ICC) కొత్త రూల్స్‌ను తీసుకొస్తూ ఉంటుంది. మైదానంలో ఇరు జట్లకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా నిబంధనలను అమలు చేస్తుంటుంది. 

Published : 04 Jan 2024 20:15 IST

(ఫొటో సోర్స్‌: యూట్యూబ్)

ఇంటర్నెట్ డెస్క్‌: ఎప్పటికప్పుడు క్రికెట్‌ ఆటను ఆకర్షణీయంగా మార్చేందుకు ఐసీసీ (ICC) నిరంతరం రూల్స్‌ని సమీక్షిస్తుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ జట్లకు సమాన అవకాశాలు ఉండేలా అవసరమైనప్పుడు రూల్స్‌ను మారుస్తుంది. ఇప్పుడు మరోసారి అలాంటి రూల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు చెబుతున్న ఆ రూల్‌ ప్రకారం.. ఫీల్డింగ్‌ జట్టు స్టంపింగ్‌ కోసం అప్పీలు చేసినప్పుడు స్టంప్‌ ఔట్‌ కోసం మాత్రమే చెక్‌ చేస్తారు. గతంలో స్టంపౌట్‌ కోసం ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేసినప్పుడు స్టంపింగ్‌తోపాటు క్యాచ్‌నూ చెక్‌ చేసి ఫలితం ఇచ్చేవారు. ఇలా చేయడం వల్ల డీఆర్‌ఎస్‌ను తీసుకోకుండా ఫీల్డింగ్‌ జట్టు లబ్ధి పొందుతుందనే విమర్శలు వచ్చాయి. అందుకే ఐసీసీ ఇప్పుడు కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఒకవేళ క్యాచ్‌ మీద ఏదైనా అనుమానం ఉంటే డీఆర్‌ఎస్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 

కంకషన్ నిబంధనలో స్వల్ప మార్పు..

కంకషన్ నిబంధనలో చిన్న మార్పులను ఐసీసీ చేసింది. ఇప్పటి వరకు ఏ ఆటగాడి స్థానంలోనైనా కంకషన్‌ ప్లేయర్‌ వస్తే నేరుగా బౌలింగ్‌ లేదా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంది. కానీ, ఇక నుంచి కంకషన్‌కు గురైన ఆటగాడు ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌ నుంచి నిషేధానికి గురైతే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే వ్యక్తికి బౌలింగ్‌ చేసే అవకాశం ఉండదు. 

నో బాల్‌ రూల్‌.. టైమ్‌ లిమిట్‌

ఇప్పటి వరకు ఫుట్‌ నోబాల్‌ను థర్డ్‌ అంపైర్‌ ఇస్తున్నాడు. ఇక నుంచి దానితోపాటు అన్ని రకాల ఫుట్‌కు సంబంధించిన నో-బాల్స్‌ను థర్డ్‌ అంపైర్‌ చెక్‌ చేసి ఇవ్వాలి. రిటర్న్‌ క్రీజ్‌ను టచ్ చేసి బౌలింగ్‌ చేసినా దానిని నో బాల్‌గా ప్రకటించాల్సి ఉంటుంది. మైదానంలో గాయపడిన ఆటగాడికి వెంటనే వైద్యసాయం అందిస్తారు. అయితే, ఇక నుంచి దానికి టైమ్‌ లిమిట్‌ ఉంటుంది. వైద్యసాయం కోసం నాలుగు నిమిషాల వరకు సమయం కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని