IND VS ENG: సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎందుకు తీసుకోలేదు? నెట్టింట ఫ్యాన్స్ ఫైర్

ఎట్టకేలకు జాతీయ జట్టులోకి వచ్చాడని సంతోషించేలోపే.. ఫైనల్‌ XIలో అవకాశం ఇవ్వకపోవడంపై సర్ఫరాజ్ ఖాన్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Updated : 02 Feb 2024 13:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో (IND vs ENG) భారత్ తరఫున రజత్‌ పటీదార్‌ అరంగేట్రం చేశాడు. మరో యువ బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్‌ను పక్కన పెట్టడంపై అతడి అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు పెట్టారు. దేశవాళీ క్రికెట్‌లో రజత్‌ కంటే సర్ఫరాజ్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడని గుర్తు చేశారు. 

‘‘రజత్‌ పటీదార్‌కు శుభాకాంక్షలు. కానీ, సర్ఫరాజ్‌కు అన్యాయం జరిగిందనిపిస్తోంది. అతడి ఫామ్‌ను బట్టి అవకాశం ఇస్తే బాగుండేది’’

‘‘సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎందుకు తీసుకోలేదో వివరించాలి. ఇది నమ్మశక్యం కాని నిర్ణయం’’

‘‘రజత్‌ సరే. సర్ఫరాజ్‌ సంగతేంటి? ఇప్పుడు ఆడే అవకాశం ఇవ్వలేదు. అతడిని మిగతా టెస్టులకైనా ఎంపిక చేస్తారా?’’

‘‘జట్టు మేనేజ్‌మెంట్ గిల్ వ్యవహారంలో మాత్రం విభిన్నంగా స్పందిస్తోంది. ఫామ్‌లో ఉన్న ఆటగాడిని మాత్రం పక్కన పెడుతోంది’’

‘‘భారత్‌ మరోసారి గత తప్పిదాలనే చేస్తోంది. రజత్‌ కంటే సర్ఫరాజ్‌కు దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది’’

సిరాజ్‌పై బీసీసీఐ ప్రకటన..

రెండో టెస్టు స్క్వాడ్‌ నుంచి సిరాజ్‌ను తప్పించడంపై బీసీసీఐ ప్రకటన చేసింది. ‘‘దాదాపు నెల రోజుల పాటు ఈ సిరీస్‌ జరగనుంది. వరుసగా మ్యాచ్‌లు ఆడుతూ ఉన్న సిరాజ్‌కు విశ్రాంతినివ్వాలని ఈ నిర్ణయం తీసుకొన్నాం. మిగతా మూడు టెస్టుల ఎంపిక కోసం అతడు అందుబాటులో ఉంటాడు. రెండో టెస్టు స్క్వాడ్‌లోకి అవేశ్‌ఖాన్‌ పేరును చేర్చాం’’ అని వెల్లడించింది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకుంది. బుమ్రాతో పాటు ముకేశ్‌ కుమార్‌ బరిలోకి దిగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు