WI vs IND: భారత్‌తో ఐదో టీ20.. నికోలస్‌ పూరన్‌కు గాయాలు

వెస్టిండీస్, భారత్ మధ్య జరిగిన ఐదో టీ20లో నికోలస్ పూరన్‌ (Nicholas Pooran)కు గాయాలయ్యాయి.

Published : 14 Aug 2023 16:06 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలై ఐదు టీ20ల సిరీస్‌ను 3-2 తేడాతో చేజార్చుకుంది. భారత్‌ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ 18 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. బ్రాండన్ కింగ్ (85*; 55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (47; 35 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) విండీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా నికోలస్ పూరన్‌ (Nicholas Pooran)కు స్వల్ప గాయాలయ్యాయి. భారత పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్ బౌలింగ్‌లో ఓ బంతి పూరన్‌ పొట్ట భాగంలో బలంగా తాకింది. దీంతో బంతి తాకిన చోట చర్మం ఎర్రగా మారిపోయింది.

పూరన్‌ చేతికి కూడా గాయమైంది. కుల్‌దీప్ యాదవ్‌ వేసిన ఐదో ఓవర్‌లో రెండో బంతిని బ్రాండన్‌ కింగ్‌ బలంగా బాదాడు. వేగం వెళ్లిన బంతి మరో ఎండ్‌లో స్ట్రైకింగ్‌లో ఉన్న పూరన్ ఎడమ చేతి మణికట్టుకు పై భాగంలో తాకింది. దీంతో అతడి చేయిపై బంతి ఆకారంలో ఎర్రటి మచ్చ ఏర్పడింది. ఈ గాయాలకు సంబంధించిన ఫొటోను పూరన్‌ సామాజిక మాధ్యమం ట్విటర్‌ (X)లో పోస్టు చేశాడు. దానికి ‘‘మ్యాచ్‌ తర్వాత నా పరిస్థితి. థాంక్యూ బ్రాండన్ కింగ్, అర్ష్‌దీప్‌’’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని