Ashwin on windies Stadiums: కనీసం పిచ్‌పై గ్రాస్‌ లేదు.. నెట్స్‌ కూడా పాతవే: అశ్విన్

వెస్టిండీస్‌ మైదానాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై భారత సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) విమర్శలు చేశాడు. మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

Updated : 08 Aug 2023 12:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ‘మేం విలాసాలు కోరుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించండి చాలు’.. ఇదీ అని వెస్టిండీస్‌తో సిరీస్‌ సందర్భంగా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) చేసిన విన్నపం. ఇదే అంశంపై భారత సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) తన యూట్యూబ్‌ ఛానెల్‌లో స్పందించాడు. అశ్విన్‌ కూడా విండీస్‌తో టెస్టు సిరీస్‌లో (WI vs IND) ఆడిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డు సరైన వసతులు కల్పించడంలో విఫలమైందని, మైదానాల్లో మౌలిక సదుపాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నాడు. 

‘‘వెస్టిండీస్‌లో క్రికెట్ వృద్ధి చెందాలంటే తొలుత మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలి. అండర్-10, అండర్-12, అండర్‌-14 ఆటగాళ్లకు కూడా మంచి నెట్స్‌, మైదానం ఉండేలా చూడాలి. అప్పుడే వారిలో ఆసక్తి పెరిగి క్రికెట్ ఆడేందుకు ముందుకొస్తారు. ఇది టాలెంట్‌తో కూడిన గేమ్. బాగా శ్రమించాలి. అయితే మైదానాల్లో మౌలిక సదుపాయాలు అత్యంత అవసరం. వెస్డిండీస్‌ భౌగోళికంగా విభిన్నంగా ఉంటుంది.  

ఆ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను చూడొద్దనుకున్నా.. కానీ: రోహిత్

బార్బడోస్‌లో టెస్టు మ్యాచ్ సందర్భంగా నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశాం. కనీసం పచ్చిక కూడా లేదు. ఆ నెట్స్‌ కూడా చాలా పాతవి. అయితే, నేను ఇలా చెప్పడానికి కారణం మాత్రం తప్పుబట్టడానికి కాదు. మౌలిక వసతులు నాసికరంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన క్రికెట్‌ ఆడేందుకు విండీస్‌ ఆటగాళ్లు కూడా ఎంతని కష్టపడాలి? ఇలాంటి పిచ్‌ల పై ప్రాక్టీస్‌ చేసిన తర్వాత.. వారు భారత్‌ వంటి మంచి పిచ్‌లపై ఆడేందుకు అవస్థ పడతారు. ఆ పరిస్థితులకు అలవాటు పడటం కష్టమవుతుంది. విండీస్ పిచ్‌లు చాలా మందకొడిగా ఉంటాయి. మైదానాల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి. అయితే, విండీస్‌లో మాత్రం పచ్చికను తొలగించి రోలర్‌తో అటు ఇటూ తిప్పేసి అదే నిర్వహణగా భావిస్తున్నారు. ఈ విషయంపై టెస్టు సిరీస్ సందర్భంగానూ మాట్లాడా. అలా చేయడం చాలా సులువే. కానీ పిచ్‌ నిర్జీవంగా మారి మందకొడిగా ఉంటుంది’’ అని అశ్విన్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని