Surya in ICC Rankings: టాప్‌లోనే సూర్యకుమార్‌.. దూసుకొచ్చిన గిల్, తిలక్‌ వర్మ

వెస్టిండీస్‌ పర్యటనలో వచ్చిన అవకాశాలను భారత యువ క్రికెటర్లు సద్వినియోగం చేసుకున్నారు. వ్యక్తిగత ప్రదర్శన అదరగొట్టడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (ICC Rankings) ఎగబాకారు.

Published : 16 Aug 2023 16:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు (Team India) అదరగొట్టారు. ఎప్పటిలానే సూర్యకుమార్‌ యాదవ్ (907 పాయింట్లు) టీ20ల్లో తన తొలి స్థానాన్ని నిలబెట్టుకోగా.. యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ ఏకంగా 43 స్థానాలను మెరుగుపర్చుకుని 25వ ర్యాంక్‌లో నిలిచాడు. టాప్‌ -10లో సూర్యకుమార్‌ మినహా మరే భారత క్రికెటర్‌కు చోటు దక్కలేదు. రెండో ర్యాంక్‌లో ఉన్న మహమ్మద్ రిజ్వాన్ (811)కు సూర్యకుమార్‌ పాయింట్ల వ్యత్యాసం భారీగానే ఉంది. విండీస్‌ పర్యటనలో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన తిలక్‌ వర్మ (509) 46వ స్థానం, యశస్వి జైస్వాల్ (395) 88వ ర్యాంక్‌ సాధించారు. 

వన్డేల్లోకి తిరిగొచ్చిన బెన్‌స్టోక్స్‌.. అసలెందుకు అతడిపై భారీ అంచనాలు?

బౌలింగ్‌ జాబితాలో మాత్రం తొలి పది మందిలో టీమ్‌ఇండియా ఆటగాడు లేడు. అయితే, ఆల్‌రౌండర్‌ లిస్ట్‌లో మాత్రం హార్దిక్‌ పాండ్య (250 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు. ఇక వన్డేఫార్మాట్‌లో శుభ్‌మన్‌ గిల్ (743 పాయింట్లు) ఐదో స్థానంలో, విరాట్ కోహ్లీ (705) తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు. వన్డే బౌలర్ల జాబితాలో మహమ్మద్ సిరాజ్ (670) నాలుగు, కుల్‌దీప్‌ యాదవ్ (622) పదో స్థానంలో నిలిచారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ ఓడిపోయినప్పటికీ భారత (264 రేటింగ్‌ పాయింట్లు) ర్యాంక్‌ మాత్రం మారలేదు. ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే, ఇంగ్లాండ్‌ (259) నుంచి తీవ్ర పోటీ ఉంది. కివీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే స్థానాలు మారే అవకాశం ఉంది. వన్డేల్లో మాత్రం భారత్‌ (113) మూడో స్థానంలోనే నిలిచింది. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా (118), పాకిస్థాన్‌ (116) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని