IND vs SA : ముగిసిన రెండో రోజు ఆట.. భారత్‌ ఆధిక్యం ఎంతంటే?

భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌...

Updated : 12 Jan 2022 21:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌ రసవత్తరంగా మారుతోంది. మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (9*), పుజారా (14*) ఉన్నారు. ప్రొటీస్‌ బౌలర్లు జాన్‌సెన్, రబాడ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరు 223/10. 

ఆరంభంలోనే ఎదురు దెబ్బ

13 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌కు స్వల్ప వ్యవధిలో ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (10), మయాంక్‌ అగర్వాల్ (7) ఔటయ్యారు. మొదట్లో ఆచితూచి ఆడిన ఓపెనర్లు.. ఒక్కసారిగా వికెట్లను సమర్పించేశారు. అయితే తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పుజారా, కోహ్లీ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రోజును ముగించారు. ప్రస్తుతం 70 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలిన ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశిస్తేనే సిరీస్‌ విజయం సాధించే అవకాశాలు భారత్‌కు ఉంటాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని