Virat Kohli: కొత్త ఫోన్ పోయింది.. మీకు ఏమైనా కనిపించిందా..?: విరాట్
ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు (IND vs AUS) సన్నద్ధమవుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) తన ఫోన్‌ను ఎక్కడో మిస్ చేసుకొన్నాడట. దీనికి సంబంధించి ట్వీట్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన ఫోన్‌ను పోగొట్టుకొన్నాడట. అదీనూ కొత్త మొబైల్. ఈ మేరకు తన ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టాడు. ‘‘బాక్స్‌లో నుంచి బయటకు కూడా తీయని ఫోన్ పోతే.. దానికంటే బాధాకరమైన ఫీలింగ్ మరొకటి ఉండదేమో.. మీలో ఎవరైనా చూశారా..?’’ అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొందరేమో ఇదేదో యాడ్ అయి ఉంటుందని కామెంట్ చేస్తుండగా.. మరికొందరేమో ఓ ఫోన్ల సంస్థను ట్యాగ్ చేస్తూ వెంటనే కోహ్లీకి ఓ మొబైల్ పంపించండి.. టెస్టు సిరీస్‌కు ముందు అతడిని ఒత్తిడికి గురి చేయొద్దని సూచించారు. ఇది ఇలా ఉంటే ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మాత్రం విచిత్రంగా స్పందించింది. ‘‘వదిన గారి ఫోన్ నుంచి ఐస్ క్రీమ్‌ను ఆర్డర్ చేసేందుకు మొహమాటం పడొద్దు. ఇప్పుడు అదే మీకు సాయపడుతుంది’’ అని జొమాటో కామెంట్ పెట్టింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. మొన్నటి వరకు కుటుంబంతో గడిపిన విరాట్.. ఇప్పుడు నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. ఆసీస్‌పై మంచి రికార్డు ఉన్న విరాట్.. తనదైన ఆటతీరుతో మరోసారి ఆధిక్యం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగ్‌పుర్ వేదికగా భారత్ - ఆసీస్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
-
India News
అవినీతి ఆరోపణలు.. రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు