Virat: ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి.. వాటిని దాటుకొని ముందుకు సాగడమే: విరాట్

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిన టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. అలాగే చాలా విమర్శలూ ఎదుర్కొన్నాడు. కానీ, వాటన్నింటినీ తన బ్యాటింగ్‌తో సమాధానం చెప్పాడు.  

Published : 12 Aug 2023 18:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  భారత మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆటపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ అభిమానులకు ఆదర్శంగా ఉంటాడు. ఆటపట్ల నిబద్ధత తారస్థాయిలో ఉంటుంది. ఏ స్థాయి మ్యాచ్‌ అయినా సరే తన జట్టు గెలుపు బాటలోనే పయనించాలనే కోరుకుంటాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోరాడి ముందుకు సాగడమే తన క్రికెట్‌ కెరీర్‌లో నేర్చుకున్న ప్రధాన అంశమని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను ప్రస్తావించాడు. 

Prithvi shaw: పృథ్వీ!.. ప్రతిభ ఉంటే సరిపోతుందా..?

‘‘వ్యక్తిగతంగా, ఆటపరంగా నా సామర్థ్యాలను నమ్మి ముందుకు సాగడమే నన్నింత వరకు తీసుకురాగలిగింది. బయట ఉంటే ప్రజలకు వారి అభిప్రాయాలు, భావాలు ఉంటాయి. వాటి నుంచి కూడా అవసరమైనవాటిని నేర్చుకుని ముందుకు సాగుతుంటా. నా సామర్థ్యం మీద నమ్మకం ఉంచడం వల్ల ఎన్ని అవాంతరాలు ఎదురైనా దాటుకుని లక్ష్యాలను సాధించగలిగా. ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉండటం వల్లే నా గేమ్‌ మీద దృష్టి పెట్టి నిరంతరం మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తుంటా. గతంలో ఏం సాధించాను.. వాటి నుంచి ఏం నేర్చుకుని ముందుకు సాగాలనేదానిపైనే ఆలోచిస్తుంటా. ఆటగాడిగా ఎలాంటి ప్రదేశాల్లో బలహీనంగా ఉన్నానేదానిపై దృష్టిపెట్టి మెరుగయ్యా. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఘనంగా పునరాగమనం చేయగలిగా’’ అని కోహ్లీ తెలిపాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ మాత్రమే ఆడిన విరాట్ కోహ్లీ వన్డేతోపాటు టీ20 సిరీస్‌ల నుంచి విరామం తీసుకున్నాడు. ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని