Visual Look Up: విజువల్‌ లుక్‌ అప్‌ వాడుతున్నారా?

Eenadu icon
By Technology News Desk Updated : 27 Nov 2024 03:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

గూగుల్‌ లెన్స్‌ తరహాలో యాపిల్‌ సంస్థ తమదైన విజువల్‌ లుక్‌ అప్‌ వర్షన్‌ను తీసుకొచ్చింది. ఇది చాలావరకూ గూగుల్‌ లెన్స్‌ మాదిరిగానే పనిచేస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్‌లతో ఒదిగిపోయిన ఇది ఫొటోలు, వీడియోలను స్కాన్‌ చేసి ఆయా ప్రాంతాలు, మొక్కలు, జంతువులు, ఆహార పదార్థాల వంటి వాటిని గుర్తిస్తుంది. వెంటనే వాటి ఫలితాలను చూపిస్తుంది. భోజనాన్ని ఫొటో తీస్తే వంటకాలను గుర్తించి, అలాంటి వంటలనూ సూచిస్తుంది. మరి దీన్ని వాడుకోవటమెలా?

విజువల్‌ లుక్‌ అప్‌ ఫీచర్‌ను వాడుకోవాలంటే ఐఫోన్‌ను ఐఓఎస్‌ 17 వర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకొని ఉండాలి. ఇది తేలికే. సెటింగ్స్‌ ద్వారా జనరల్‌ విభాగంలోకి వెళ్లి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ మీద తాకితే అందుబాటులో ఉన్న అప్‌డేట్స్‌ కనిపిస్తాయి. ఒకవేళ ఐఓఎస్‌ 17 ఇన్‌స్టాల్‌ కానట్టయితే సూచనల ఆధారంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

  • ఐఓఎస్‌ను అప్‌డేట్‌ చేసుకున్నాక తెలుసుకోవాలనుకునే అంశాలు గల ఫొటోను ఓపెన్‌ చేసి, ఫుల్‌ స్క్రీన్‌లో చూడాలి. అదే వీడియో అయితే ఆ ఫ్రేమ్‌ను పాజ్‌ చేస్తే చాలు. తర్వాత డిలీట్‌ బటన్‌ పక్కనుండే ఇన్ఫో బటన్‌ను తాకాలి. ఒకవేళ ఇన్ఫో బటన్‌ గుర్తు చిన్న చుక్కలతో కనిపించినట్టయితే విజువల్‌ లుక్‌ అప్‌ చురుకుగా పనిచేస్తుందని అర్థం. ఆ వస్తువును విజవల్‌ లుక్‌ అప్‌ గుర్తించిందనటానికిది సంకేతం.
  • తర్వాత ఈ చుక్కలతో కూడిన ఇన్ఫో బటన్‌ మీద తాకాలి. పైన ఫొటో సమాచారం వద్ద ఉండే లుక్‌ అప్‌ను ఎంచుకోవాలి. అప్పుడు ఆ ఇమేజ్‌కు సంబంధించిన సమాచారమంతా కనిపిస్తుంది. ఉదాహరణకు- లుక్‌ అప్‌ ప్లాంట్‌ మీద తాకితే దాని సంరక్షణ గురించి వివరిస్తుంది. లుక్‌ అప్‌ ఆర్ట్‌ మీద తాకితే పెయింటింగ్‌ గీసిన వారు, దాని చరిత్రను తెలియజేస్తుంది. ఇది మొక్కలు, జంతువులు, ఆహార పదార్థాల గురించే కాదు.. లాండ్రీ చిహ్నాలు, డ్యాష్‌బోర్డు గుర్తుల వంటి వాటినీ గుర్తించగలదు. 
  • నోట్స్, మెయిల్, మెసేజెస్‌ వంటి ఇతర యాప్స్‌లోనూ విజువల్‌ లుక్‌ అప్‌ను వాడుకోవచ్చు. ఇమేజ్‌ మీద తాకి, కాసేపు అదిమి పట్టి.. ఇన్ఫో బటన్‌ మీద తాకితే చాలు. సఫారీలోనైతే మెనూ ద్వారా లుక్‌ అప్‌ను ఉపయోగించుకోవచ్చు. 
Tags :
Published : 27 Nov 2024 01:19 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు