Siddipet: బైక్‌పై వాగు దాటుతూ.. భార్యాభర్తలు గల్లంతు!

Eenadu icon
By Telangana News Team Updated : 30 Oct 2025 20:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అక్కన్నపేట: ‘మొంథా’ తుపాను కారణంగా సిద్దిపేట జిల్లా జలమయమైంది. ఈ క్రమంలోనే అక్కన్నపేట మోత్కులపల్లి వాగులో వరద ఉద్ధృతికి భార్యాభర్తలు గల్లంతయినట్లు సమాచారం. ప్రణయ్‌, కల్పన దంపతులు భీమదేవరపల్లి మండలం నుంచి అక్కన్నపేటకు బయల్దేరారు. మల్లారం దగ్గర రోడ్డు దెబ్బతిన్నట్లు గుర్తించి.. వేరే దారిలో వెళ్లారు. మార్గమధ్యంలో మోత్కులపల్లి వద్ద వాగులో కొట్టుకుపోయారు. ఉదయం అక్కడే ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన స్థానికులు.. దాని నంబర్ ద్వారా వివరాలు ఆరా తీశారు. గల్లంతయిన వారికోసం స్థానికుల సాయంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరా తీశారు. సిద్దిపేట కలెక్టర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. దంపతుల ఆచూకీ ఇంకా లభించలేదని కలెక్టర్‌ తెలిపారు. దీంతో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపి గాలింపు చేపట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. అన్ని విధాలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సహాయక చర్యల్లో భాజపా శ్రేణులు కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు.  

Tags :
Published : 30 Oct 2025 16:31 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు