KTR: పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు
పెద్దల జోలికి ఎందుకు వెళ్లలేదో చెప్పాలి: కేటీఆర్

ఫిల్మ్‌నగర్, న్యూస్‌టుడే: హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లను కూల్చేశాయని, ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని, హైడ్రా కూల్చివేతలతో అన్యాయానికి గురైన బాధితులందరికీ అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. ‘పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేదవాళ్లకు ఒక న్యాయం’ పేరిట హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హైడ్రా పేరుతో ప్రభుత్వం పాల్పడుతున్న అరాచకాలకు ఎంతోమంది బాధితులుగా మారారు. చాంద్రాయణగుట్టలో పాఠశాల భవనాన్ని కూడా కూలగొట్టారు. కేసీఆర్ హయాంలో ఎక్కడ చూసినా కట్టడాలే కనిపించేవి. హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాం. వైట్‌హౌస్‌ను తలదన్నేలా సచివాలయం, దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం. హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాం. ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కట్టాం. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం.
రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త నిర్మాణం కూడా చేపట్టలేదు. రేవంత్‌రెడ్డి చేసిన పని కూలగొట్టడమే. పేదవాడికి ఒక న్యాయం.. ఉన్నవాడికి ఒక న్యాయం... ఇదే ఈ ప్రభుత్వం పనితీరు. హైడ్రాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్ద ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ రోజు చాలా మంది బిల్డర్ల పేర్లు చెప్పారు. ఏ బిల్డర్‌నూ మేం ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. పేదల ఇంటికి వచ్చిన బుల్డోజర్... ఆ బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లలేదో ప్రభుత్వం చెప్పాలి. ఎఫ్టీఎల్ పరిధిలో కడితే ఎవర్నీ వదలబోమని చెప్పినా... పెద్దలను వదిలేశారు. చెరువును పూడ్చి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కట్టారు. మరో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా హిమాయత్‌సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారు. రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఇల్లు నిర్మించుకున్నారు. వీళ్లను ముట్టుకునే ధైర్యం హైడ్రా చేస్తుందా? అందుకే హైడ్రాను మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆయిల్‌పాం దిగుమతి శాతంలో తెలంగాణ హవా!
ఈ ఏడాది భారీ వర్షాలతో చాలా పంటలు దెబ్బతిన్నా ఆయిల్‌పాం మాత్రం బలంగా నిలిచింది. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక ఓఈఆర్ (నూనె దిగుమతి శాతం) నమోదుతో తెలంగాణ రికార్డు సృష్టిస్తోంది. - 
                                    
                                        

అభివృద్ధికి దూరం.. గుర్తింపు కోసం ఆరాటం
ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వలస వచ్చిన గొత్తికోయల జీవనం దుర్భరంగా తయారైంది. - 
                                    
                                        

సైబర్ నేరాల నియంత్రణకు కవచం
రోజురోజుకీ తీవ్రమవుతున్న సైబర్ నేరాలను నియంత్రించేందుకు సరికొత్త కవచం అందుబాటులోకి రాబోతోంది. - 
                                    
                                        

మైస్ టూరిజం 2.0
విదేశీ, ఇతర రాష్ట్రాల పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా మైస్ టూరిజంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. - 
                                    
                                        

ఔషధాల వివరాలన్నీ క్యూఆర్ కోడ్‌లో...
రాష్ట్రంలోని సర్కారు ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.500 కోట్ల విలువైన ఔషధాలను కొనుగోలు చేస్తుండగా... ఏటా పెద్దమొత్తంలో మందులు గడువు తీరి వృథా అవుతున్నాయి. - 
                                    
                                        

కేసుల పరిష్కారానికే మధ్యవర్తిత్వం
కోర్టుల్లో విపరీతంగా పెరుగుతున్న కేసులను తగ్గించేందుకు ‘మధ్యవర్తిత్వం’ దోహదపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర హైకోర్టు మీడియేషన్- ఆర్బిట్రేషన్ సెంటర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రెసిడెంట్ జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. - 
                                    
                                        

ప్రిన్సిపల్ వేధిస్తున్నారని విద్యార్థినుల ఆందోళన
ప్రిన్సిపల్ వేధింపులకు పాల్పడుతున్నారని.. ఆమెను విధుల నుంచి తొలగించాలంటూ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆదివారం ఆందోళనకు దిగారు. - 
                                    
                                        

గోల్ఫ్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణం: మంత్రి జూపల్లి
అంతర్జాతీయ గోల్ఫ్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం తెలంగాణకు రావడం గర్వకారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. - 
                                    
                                        

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు డిసెంబరు 9లోపు నెరవేర్చాలి: శ్రీపాల్‌రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న సందర్భంగా... మ్యానిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను డిసెంబరు 9లోపు అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. - 
                                    
                                        

సెల్ఫోన్లోనే కరెంటు మీటర్ రీడింగ్
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో వినియోగదారులు తమ సెల్ఫోన్లోనే కరెంటు మీటర్ రీడింగ్‌ని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని... నెలవారీ బిల్లు పెరగకుండా పొదుపు పాటించడానికి అవకాశం ఏర్పడుతుందని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. - 
                                    
                                        

ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే
నిపుణుల సూచనల మేరకు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ కోసం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తల ఆమోదం మేరకు ‘హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. - 
                                    
                                        

నీరు లేక.. పరిశోధనలు సాగక
దోమల నియంత్రణపై పరిశోధనలు కొనసాగించే హైదరాబాద్ బేగంపేటలోని సుప్రసిద్ధ సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీకి ఏళ్లుగా నీటి సమస్య తీరడం లేదు. - 
                                    
                                        

భూగర్భ జలాలు గలగల..
కుంభవృష్టి వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి అక్టోబరు వరకు రాష్ట్ర సాధారణ వర్షం 831 మిల్లీమీటర్ల(మి.మీ.)కు గాను 1,164 మి.మీ. కురిసింది. - 
                                    
                                        

సర్వీసులో ఉంటూనే ధ్రువపత్రాలు అద్దెకు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేస్తూనే వందల మంది తమ ధ్రువపత్రాలను ప్రయివేటు ఔషధ దుకాణాలకు అద్దెకు ఇచ్చిన వ్యవహారం వైద్య ఆరోగ్య శాఖలో కలకలం రేపుతోంది. - 
                                    
                                        

రహదారి మధ్యలో బిందు సేద్యం
కరీంనగర్ నుంచి వరంగల్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 563లో విభాగిని (డివైడర్) మధ్యలో నాటిన మొక్కలకు బిందు సేద్యం ద్వారా నిత్యం నీరందించేందుకు ప్రతి కిలో మీటరుకు 5 వేల లీటర్ల సామర్థ్యం గల రెండు ప్లాస్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. - 
                                    
                                        

10 నెలల చిన్నారి ఇంటిని తీసుకొచ్చింది
పది నెలల చిన్నారి హన్సికను లక్కీడ్రా వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధి గణేశ్‌నగర్‌లో రూ.16 లక్షల విలువైన 66 గజాల స్థలం, అందులో నిర్మించిన ఇంటిని రూ.500కే ఈ చిన్నారి సొంతం చేసుకుంది. - 
                                    
                                        

గురువు పాటవం.. గోడలూ చెబుతాయి పాఠం
పాఠాలు చెప్పి వదిలేయకుండా ఆయా అంశాలకు సంబంధించిన బొమ్మలను తరగతి గదిలో గోడలపై స్వయంగా వేస్తూ విద్యార్థులకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గొరిట జడ్పీ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రాచర్ల నరేందర్. - 
                                    
                                        

రాష్ట్రం నలువైపులా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు!
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల(ఈవీ)కు ఛార్జింగ్ స్టేషన్ల(సీఎస్) కొరత తీర్చేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. - 
                                    
                                        

గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ బస్ రిజర్వేషన్!
బస్సు టికెట్ రిజర్వేషన్, ఛార్జీల చెల్లింపులను మరింత సులభతరం చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టిపెట్టింది. - 
                                    
                                        

ఇక ఊరూరా బ్యాంకింగ్ సేవలు
ప్రతి పల్లెకూ బ్యాంకు సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్రం అన్ని రాష్ట్రాల బ్యాంకర్ల సమితు(ఎస్ఎల్బీసీ)లకు ఆదేశాలు జారీచేసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

బాపట్ల జిల్లాలో కారు, లారీ ఢీ.. నలుగురు మృతి
 - 
                        
                            

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌కు రిమాండ్
 - 
                        
                            

రూ.25 లక్షల చికిత్స... నిమ్స్‌లో ఉచితం!
 - 
                        
                            

ఈ విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తి: ప్రధాని మోదీ
 - 
                        
                            

విజయవాడ ఆస్పత్రి వద్ద జోగి రమేశ్ అనుచరుల హంగామా
 - 
                        
                            

సచిన్ వినయం, మానవత్వం ప్రత్యక్షంగా చూశా: మంత్రి నారా లోకేశ్
 


