KTR: కాంగ్రెస్‌ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’: కేటీఆర్‌

Eenadu icon
By Telangana News Team Published : 25 Nov 2025 17:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’ మోగించాలని మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, గురుకుల సమస్యలపై త్వరలో పోరుబాట పడతామన్నారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నేతలతో మాజీ మంత్రి కేటీఆర్‌ మంగళవారం సమావేశమయ్యారు. వచ్చే నెల నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. 

సామాజిక మాధ్యమాల వేదికగా కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ‘‘విద్యారంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. బీసీ డిక్లరేషన్‌లోని హామీలు అమలయ్యే వరకు పోరాడాలి. రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరలేపింది. 9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు పాలసీ తీసుకొచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు తక్కువ ధరకే భూములు ఇస్తున్నారు’’ అని కేటీఆర్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు