ఇంకా చిక్కని చిరుత

ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే మైదానంలో ప్రహరీ దూకిన చిరుతను బంధించడానికి అటవీ శాఖ, విమానాశ్రయంలో భద్రతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం అదనంగా మరో బోనును ఏర్పాటు చేసి, అనుమానిత ప్రాంతాల్లో 10 ట్రాప్‌ కెమెరాలను బిగించారు.

Published : 30 Apr 2024 04:07 IST

విమానాశ్రయంలో నిఘా పెంచిన అధికారులు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే మైదానంలో ప్రహరీ దూకిన చిరుతను బంధించడానికి అటవీ శాఖ, విమానాశ్రయంలో భద్రతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం అదనంగా మరో బోనును ఏర్పాటు చేసి, అనుమానిత ప్రాంతాల్లో 10 ట్రాప్‌ కెమెరాలను బిగించారు. రన్‌వే ప్రాంతంలో చెరువు, చిట్టడవి ఉండటంతో అక్కడికి సేదతీరడానికి వస్తుందని భావిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు బంధించడానికే ప్రయత్నిస్తామని, చిక్కకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాంక్విలైజర్‌తో పట్టుకుంటామని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని