ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌పై తెలంగాణ యువకుడు

దేశంలో అన్ని కులాలు, మతాలు సమానమనే సందేశాన్ని చాటుతూ..ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటి రాజిపేటలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన ఏకు చిరంజీవి.

Published : 19 May 2024 03:09 IST

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపు వద్ద తెలంగాణతల్లి చిత్రపటంతో చిరంజీవి

పరకాల, న్యూస్‌టుడే: దేశంలో అన్ని కులాలు, మతాలు సమానమనే సందేశాన్ని చాటుతూ..ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటి రాజిపేటలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన ఏకు చిరంజీవి. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 9న నేపాల్‌కు వెళ్లగా.. 10న కాలినడకన పర్వతాధిరోహణను ప్రారంభించారు. 17న ఉదయం 11.55 గంటలకు ఎవరెస్టు బేస్‌ క్యాంపునకు చేరుకొని త్రివర్ణ పతాకాన్ని, తెలంగాణ తల్లి, భరతమాత, అంబేడ్కర్, భగత్‌సింగ్‌ల చిత్రపటాలను ఆవిష్కరించి తన భావాలను చాటిచెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని