Donald Trump: ట్రంప్ చేతిపై ఎర్రని మచ్చలు వైరల్‌.. ఆయన ఏం చెప్పారంటే..?

తన చేతిపై ఎర్రని మచ్చల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌(Donald Trump) స్పందించారు. 

Published : 03 Feb 2024 02:18 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన చేతిపై ఎర్రని మచ్చలు(Red Spots) దర్శనమిచ్చాయి. దాంతో ఆయనకు ఏమైందంటూ నెట్టింట్లో ఒకటే చర్చ నడిచింది. ఈ విషయంపై తాజాగా ట్రంప్ తనదైన శైలిలో బదులిచ్చారు.

కొద్దిరోజుల క్రితం తన మాన్‌హట్టన్‌ అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు వచ్చిన ట్రంప్(Donald Trump).. అభిమానులను చూస్తూ గాల్లోకి చేతిని ఊపారు. అప్పుడే ఆయన చేతిపై ఎర్రని మచ్చలను ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. తర్వాత ఆ చిత్రాలు వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా ఓ మీడియా సంస్థ ప్రశ్నించింది. ‘మీ చేయి ఎలా ఉంది..?’ అని అడిగారు. ‘నా చేయా..?’ అంటూ ఆయన ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయారు. ‘మీరు ఫొటోలు చూడలేదా..?’ అని మళ్లీ ఆయన్ను అడగ్గా.. ‘నేను ఆ ఫొటోలు చూడలేదు. నా చేతులకు ఏమీ కాలేదు. అదంతా ఏఐ(కృత్రిమ మేధ) వల్ల కావొచ్చు’ అని మాజీ అధ్యక్షుడు బదులిచ్చారు.

అయితే ఆ ఎర్రని మచ్చలపై నెటిజన్లు పలు ఊహాగానాలు చేశారు. ఇన్ఫెక్షన్ కావొచ్చని కొందరు, కెచప్ లేక ఎర్ర సిరా అంటి ఉండొచ్చని ఇంకొందరు కామెంట్లు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని