Gaza: అణ్వాయుధ ప్రయోగానికీ అవకాశం : ఇజ్రాయెల్‌ మంత్రి వ్యాఖ్యలను తోసిపుచ్చిన ప్రధాని

గాజాపై కొనసాగుతున్న యుద్ధంలో (Israel Hamas Conflict) అణుబాంబును వదలడం కూడా తమవద్ద ఉన్న అవకాశాల్లో ఒకటని ఇజ్రాయెల్‌ మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) తోసిపుచ్చారు.

Published : 05 Nov 2023 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాజాపై ప్రతిదాడులు చేస్తోన్న ఇజ్రాయెల్‌పై (Israel Hamas Conflict) అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ హమాస్‌ ఉగ్రవాదులను అంతం చేసే వరకు తమ పోరు కొనసాగుతుందని ఇజ్రాయెల్‌ స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత కలవరపెట్టాయి. గాజాపై కొనసాగుతోన్న యుద్ధంలో అణుబాంబును ప్రయోగించడం కూడా తమవద్ద ఉన్న అవకాశాల్లో ఒకటని పేర్కొనడం చర్చనీయాంశమయ్యింది. అయితే, దీనిపై ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) తక్షణమే స్పందిస్తూ.. మంత్రి చెప్పిన మాటలు వాస్తవదూరమన్నారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి వ్యవహరిస్తున్నామన్నారు.

ఇజ్రాయెల్‌ ప్రధానిపై పెరుగుతోన్న వ్యతిరేకత.. ఇంటి ముందు ప్రజల ఆందోళన!

‘గాజాపై జరుగుతోన్న యుద్ధంలో అణ్వాయుధాన్ని వినియోగించడం కూడా మా వద్ద ఉన్న ఒక ఆప్షన్‌. అక్కడ సామాన్యులు ఎవరూ లేరు. గాజాకు మానవతా సాయం అందించడం ఓ వైఫల్యమే అవుతుంది’ అని స్థానిక రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్‌ మంత్రి అమిచాయ్‌ ఎలియాహు పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రధాని నెతన్యాహు తక్షణమే స్పందించారు. ఎలియాహు వ్యాఖ్యలు వాస్తవ దూరమన్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఇజ్రాయెల్‌, ఐడీఎఫ్‌లు నడుచుకుంటున్నాయన్నారు. విజయం సాధించే వరకు గాజాపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రిని ప్రభుత్వ సమావేశాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

2500 స్థావరాలపై దాడి..

గాజాపై దాడులు ఉద్ధృతం చేసిన ఇజ్రాయెల్‌ సేనలు అనేక హమాస్‌ అనుమానాస్పద భవనాలను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలో భూతల దాడులు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 2500 స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ రక్షణ దళం (IDF) వెల్లడించింది. హమాస్‌ ఉగ్రవాదులను తుదముట్టించే వరకు ఈ ముఖాముఖి పోరును కొనసాగిస్తామని, ఉగ్రవాద స్థావరాలు, వారి మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు