Joe Biden: ట్రంప్‌ అబద్ధాలే కేపిటల్‌పై దాడికి ఉసిగొల్పాయి: బైడెన్‌

డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పిన పెద్ద బూటకపు మాటలే...

Updated : 07 Jan 2022 12:16 IST

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పిన పెద్ద బూటకపు మాటలే... ఏడాది కిందట అమెరికా పార్లమెంటు భవన సముదాయం కేపిటల్‌ హిల్‌పై దాడికి కారణమయ్యాయని అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా మండిపడ్డారు. మాజీ అధ్యక్షుడి మాటలు ఇప్పటికీ జాతీయ విభజన దిశగా కొందర్ని ప్రేరేపిస్తున్నాయన్నారు. అగ్రరాజ్య ప్రజాస్వామ్య గొంతుపై బాకు పెట్టడానికి ఎవర్నీ అనుమతించబోనన్నారు. దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా- గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి బైడెన్‌ హాజరయ్యారు. రిపబ్లికన్లు ఓటమిని జీర్ణించుకోలేకే నాడు తన విజయాన్ని అంగీకరించలేకపోయారని దెప్పిపొడిచారు. తిరుగుబాటు ఘటనకు సంబంధించి తప్పుడు కథనాలు పుట్టుకు రావడాన్ని తూర్పారబట్టారు. ‘‘గతేడాది జనవరి 6న ఇక్కడేం జరిగిందో మనమంతా కళ్లారా చూశాం. నిజమేదో, అబద్ధమేదో మనకు స్పష్టంగా తెలుసు. నాటి ఎన్నికల గురించి మాజీ అధ్యక్షుడు అబద్ధాలను వ్యాపింపజేశారు. మేం మాత్రం అమెరికా ఆత్మ కోసం పోరాడుతున్నాం. నేను ఈ దేశాన్ని పరిరక్షిస్తాను’’ అని బైడెన్‌ చెప్పారు. అంతకుముందు ఉదయం నిర్వహించిన పలు జ్ఞాపకార్థ కార్యక్రమాల్లోనూ డెమోక్రటిక్‌ పార్టీ చట్టసభ్యులు నేరుగా, వీడియో ద్వారా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని