అధికంగా ఉన్న కెనడా దౌత్యవేత్తలు వెనక్కి!

భారత్‌లో అధికంగా గల తమ దౌత్యవేత్తలను కెనడా వెనక్కు తీసుకుంది. దిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కెనడా దౌత్యవేత్తలను.. కౌలాలంపూర్‌ (మలేసియా) లేదా సింగపూర్‌కు తరలించినట్లు తెలిసింది.

Published : 07 Oct 2023 04:39 IST

ఫలితమిచ్చిన భారత అల్టిమేటం

టొరంటో: భారత్‌లో అధికంగా గల తమ దౌత్యవేత్తలను కెనడా వెనక్కు తీసుకుంది. దిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కెనడా దౌత్యవేత్తలను.. కౌలాలంపూర్‌ (మలేసియా) లేదా సింగపూర్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ మేరకు కెనడాకు చెందిన ప్రైవేటు టీవీ నెట్‌వర్క్‌ సీటీవీ న్యూస్‌ తన కథనంలో పేర్కొంది. అయితే, ఎంతమంది దౌత్య సిబ్బందిని భారత్‌ నుంచి తరలించారనేదానిపై స్పష్టత లేదు. దీనిపై అటు కెనడా నుంచి గానీ.. ఇటు భారత ప్రభుత్వం నుంచి గానీ అధికారిక ప్రకటన రాలేదు. దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని ఇటీవల దిల్లీ.. ట్రూడో సర్కారుకు అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో కెనడా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం భారత్‌లో 60 మందికి పైగా కెనడా దౌత్య సిబ్బంది ఉండగా.. అందులో 41 మందిని ఒట్టావా వెనక్కి పిలిపించుకోవాలని భారత్‌ సూచించినట్లు సమాచారం.

నిషేధిత ఆయుధాలు కలిగి ఉన్నారంటూ కెనడాలోని ఒంటారియా ప్రావిన్స్‌ బ్రాంప్టన్‌ నగరంలో ఎనిమిది మంది సిక్కు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారంతా 19 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్కులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు