అమెరికా డ్రోన్‌ను కూల్చిన హూతీలు

ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్‌ క్షిపణులతో బాబ్‌ ఎల్‌ మండేబ్‌ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు.

Published : 28 Apr 2024 04:59 IST

ఓ నౌకపై బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి

జెరూసలెం: ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్‌ క్షిపణులతో బాబ్‌ ఎల్‌ మండేబ్‌ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. శుక్రవారం బ్రిటన్‌కు చెందిన వాణిజ్య నౌకపై మూడు బాలిస్టిక్‌ మిసైళ్లు ప్రయోగించారు. తమ దాడిలో నౌకకు తీవ్ర నష్టం కలిగిందని హూతీల అధికార ప్రతినిధి తెలిపారు. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ మాత్రం ఓ క్షిపణి మాత్రమే నౌకను తాకిందని, జరిగిన నష్టం స్వల్పమేనని, నౌక యథావిధిగా ప్రయాణం సాగిస్తోందని పేర్కొంది. ఈ నౌక రష్యాలోని ప్రిమోస్క్‌ నుంచి భారత్‌లోని వాడినార్‌కు వెళుతోంది. అమెరికా ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ను కూడా కూల్చివేసినట్లు హూతీ వేర్పాటువాదులు పేర్కొన్నారు. ఈ కూల్చివేతపై అగ్రరాజ్యం స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని