మా ప్రాంతంలో రష్యా భారీగా సైన్యాన్ని మోహరించింది: జెలెన్‌స్కీ

Eenadu icon
By International News Desk Published : 01 Nov 2025 04:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కీవ్‌: అత్యంత కీలకమైన పొక్రొవిస్క్‌ నగరాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌లోని తూర్పు దొనెస్క్‌ ప్రాంతంలో రష్యా దాదాపు 1,70,000 మంది సైనికుల్ని మోహరించిందని అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ శుక్రవారం ఆరోపించారు. అయితే వారు పొక్రొవిస్క్‌ను స్వాధీనం చేసుకోకుండా తమ బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయని తెలిపారు. ఉక్రెయిన్‌లోని కొన్ని కీలక నగరాలు తమ అధీనంలోకి వస్తున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించిన నేపథ్యంలో జెలెన్‌స్కీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు