Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
సైనిక శిక్షణ కేంద్రంలో మాయమైన ఓ భారీ యుద్ధట్యాంకు ఆచూకీ ఓ తుక్కు కేంద్రంలో లభ్యమైన వింత ఘటన ఇజ్రాయెల్‌లో చోటుచేసుకుంది.
టెల్అవీవ్: మిలటరీ శిక్షణా కేంద్రంలో కనిపించాల్సిన ఓ భారీ యుద్ధట్యాంకు (Military tank) మాయమైంది. అంతటా గాలించగా.. చివరకు అది ఓ తుక్కు కేంద్రంలో దర్శనమిచ్చింది. ఇజ్రాయెల్ (Israel)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దాదాపు 65 టన్నుల బరువైన ఆ ట్యాంకును అక్కడికి ఎవరు ఎత్తుకెళ్లారనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
‘మెర్కవా 2 (Merkava 2)’ అనే భారీ యుద్ధట్యాంకు గతంలో ఇజ్రాయెల్ సైన్యంలో సేవలందించింది. ప్రస్తుతం దాన్ని తీరప్రాంత నగరమైన హైఫా సమీపంలోని మిలటరీ ట్రైనింగ్ జోన్‌కు తరలించారు. అక్కడ సైన్యం శిక్షణ అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇటీవల అది అదృశ్యమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. ఈ క్రమంలోనే గాలింపు చేపట్టగా.. దూరంగా ఓ తుక్కు కేంద్రంలో దాని ఆచూకీ లభ్యమైంది. ఆ వీడియో వైరల్‌గా మారింది.
ఇక ఆయుధాలివ్వం.. ఉక్రెయిన్‌కు పోలాండ్ షాక్..!
ఈ యుద్ధట్యాంకు ఏళ్ల క్రితమే సైన్యం నుంచి డీకమిషన్ అయ్యిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ప్రస్తుతం అందులో ఆయుధాలేవీ లేవని సైన్యం తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలస్తీనీయులకు ఎందుకీ శిక్ష?
హమాస్ క్రూరత్వానికి.. పాలస్తీనా ప్రజలను సామూహికంగా శిక్షించడం సరికాదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. -
భారత్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీపై ఒత్తిడి తేలేం: పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత ప్రజల ప్రయోజనాల కోసం మోదీ కఠిన నిర్ణయాలు తీసుకుంటారని కొనియాడారు. -
కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలింపు
గాజాస్ట్రిప్‌లో అదుపులోకి తీసుకుంటున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. -
పన్నూ హత్యకు కుట్ర బాధ్యులపై చర్య తీసుకోవాలి: అమెరికా
తమ వ్యూహాత్మక భాగస్వామి భారత్‌తో బంధాన్ని మరింత దృఢపరచుకుంటున్నామని, అదే సమయంలో న్యూయార్క్‌లో సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరుతున్నామని అమెరికా గురువారం స్పష్టం చేసింది. -
చర్చలు, దౌత్యంతోనే పరిష్కరించుకోవాలి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న ఘర్షణపై, ఆ ప్రాంతంలో దిగజారుతున్న భద్రతా పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని శుక్రవారం లోక్‌సభలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. -
బైడెన్ కుమారునిపై నేరాభియోగాలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ (53) పై గురువారం కాలిఫోర్నియాలో తొమ్మిది అభియోగాలు నమోదయ్యాయి. -
అమెరికాలో భారతీయ హోటల్ మేనేజర్‌కు 57 ఏళ్ల జైలు
అమెరికాలోని జార్జియాలో హోటల్ మేనేజర్‌గా ఉన్న భారత జాతీయుడు శ్రీష్ తివారి(71)కి స్థానిక న్యాయస్థానం 57 ఏళ్ల జైలుశిక్ష విధించింది. -
అందాల శ్వేత మకరం!
ఈ చిత్రంలో కనిపిస్తున్నది బల్లి కాదు. అరుదైన శ్వేతరంగు మొసలి. అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడాలో గేటర్లాండ్ సరీసృపాల పార్కులో ఇది జన్మించినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. -
సాగరంలో పెరుగుతున్న ఆమ్లత్వం
ఉష్ణ మండలానికి ఎగువన, దిగువన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత గత 40 ఏళ్లలో 1 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగింది. -
విదేశీ విద్యార్థులపై జీవనవ్యయ భారం
ఉన్నత విద్య కోసం తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులపై కెనడా ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. -
Putin: రెండు దశాబ్దాలుగా ‘ఒకేఒక్కడు’.. ఐదోసారి అధికారానికి ‘సై’!
రష్యాలో రెండు దశాబ్దాలకుపైగా అధికారంలో కొనసాగుతూ దేశంలో ఎదురులేని నేతగా నిలిచిన పుతిన్.. 2036 వరకు అధ్యక్ష పదవిలో ఉండేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు!
-
పొరపాటున పేలిన ఎస్.ఐ. తుపాకీ.. మహిళ తలలోకి దూసుకెళ్లిన తూటా
-
Anganwadi Vacancy: తెలంగాణలో 8,815 అంగన్వాడీ పోస్టులు ఖాళీ
-
Govt schools in AP: సర్కారు వారి.. తడికెల బడి
-
డోరు తెరుచుకున్నా పైకి రాని లిఫ్ట్.. నాలుగో అంతస్తు నుంచి పడి కొరియర్ బాయ్ మృతి
-
ముఖంపై పేడ వేసిన గేదె ఊపిరాడక చిన్నారి మృతి