USA: ట్రంప్‌ ‘గందరగోళ’ వ్యవహారం.. అమెరికాకు ప్రమాదకరం!: నిక్కీ హేలీ

ఇరాన్, రష్యా, చైనాలు ఒకే గూటి పక్షులని.. ప్రజల స్వేచ్ఛను తుడిచేయాలనే లక్ష్యంతోనే అవి ఉన్నాయని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారతీయ- అమెరికన్ నిక్కీ హేలీ ఆరోపించారు.

Published : 29 Oct 2023 19:32 IST

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి గెలవడం.. నాలుగేళ్ల గందరగోళం, ప్రతీకారాలు, నాటకీయ పరిణామాలకు దారి తీస్తుందని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారతీయ- అమెరికన్ నిక్కీ హేలీ (Nikki Haley) వ్యాఖ్యానించారు. ఇది అమెరికా (America)కు ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం నౌక (అమెరికా)ను స్థిరంగా ఉంచే కెప్టెన్ (అధ్యక్షుడు) అవసరమని, దాన్ని ముంచేవారు కాదని చెప్పారు. లాస్‌ వెగాస్‌లో యూదు రిపబ్లికన్లను ఉద్దేశించి నిక్కీ హేలీ ప్రసంగించారు. యూదు వ్యతిరేకత (Antisemitism)పై పోరాడాలని, హమాస్‌ను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్‌ (Israel)కు అవసరమైన సాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు.

అధ్యక్ష బరి నుంచి వైదొలిగిన అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు

ఇజ్రాయెల్- హమాస్‌, ఉక్రెయిన్- రష్యా యుద్ధాలతోపాటు ఇతర ప్రాంతాల్లోని హింసను ప్రస్తావిస్తూ.. ప్రపంచం మంటల్లో చిక్కుకుందని నిక్కీ హేలీ అన్నారు. ఓ సైనికుడి భార్యగా, ఇద్దరు బిడ్డల తల్లిగా.. యుద్ధాన్ని ఆపడం, శాంతిని కాపాడటం, అమెరికన్లను రక్షించడం మించి తనకు ఏదీ ముఖ్యం కాదన్నారు. మన స్వేచ్ఛను మనమే రక్షించుకోవాలని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును విమర్శిస్తూ, హిజ్బుల్లాను తెలివైనదిగా పేర్కొంటూ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా నిక్కీ హేలీ ఖండించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ తిరిగి ఎన్నికవడం కూడా భరించలేమని అన్నారు. ఇరాన్, రష్యా, చైనాలు ఒకే గూటి పక్షులని.. ప్రజల స్వేచ్ఛను తుడిచేయాలనే లక్ష్యంతోనే అవి ఉన్నాయని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని