Trump: ఉపాధ్యక్ష అభ్యర్థి అతడేనా..? ఒకే వేదికపై ట్రంప్‌, వివేక్

తొలి ప్రైమరీ పోరులో విజయంతో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌(Donald Trump) వర్గం ఫుల్‌ జోష్‌లో ఉంది. ఆయనకు మరో నేత వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) నుంచి పూర్తి మద్దతు దక్కుతోంది.

Updated : 17 Jan 2024 12:39 IST

వాషింగ్టన్‌: అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలిగిన భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy).. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)తో వేదిక పంచుకున్నారు. ఆ సందర్భంగా వీపీ(ఉపాధ్యక్షుడు).. అంటూ కార్యకర్తలు ఉత్సాహంగా కేకలు వేశారు. అయోవాలో తొలి ప్రైమరీ పోరులో విజయం సాధించిన ట్రంప్‌.. న్యూ హాంప్‌షైర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచారం మొత్తం ఇద్దరు నేతలు ఒకరినొకరు ప్రశంసించుకున్నారు.

కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 86% తగ్గుదల

ఈ సందర్భంగా వివేక్‌ మాట్లాడుతూ.. ‘అధ్యక్ష రేసులో ఈ వ్యక్తికంటే మెరుగైన ఎంపిక ఇంకోటి లేదు. అందుకే తర్వాతి అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఓటు వేయాలని మిమ్మల్ని కోరుతున్నాను’ అంటూ ప్రసంగించారు. దీనిపై ఆయనకు ట్రంప్‌ (Trump) కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ఆయన ఆమోదం లభించడం గర్వంగా ఉంది. ఆయన మాతో కలిసి పనిచేస్తారు. చాలాకాలం పాటు మాతో కలిసి ముందుకుసాగుతారు’ అని వెల్లడించారు. అలాగే రామస్వామి(Vivek Ramaswamy) ప్రచారం తీరును ప్రశంసించారు. ఈసందర్భంగా ‘ఉపాధ్యక్షుడు’ అంటూ మద్దతుదారులు పలుమార్లు నినాదాలు చేస్తుంటే.. వారిద్దరూ చిరునవ్వులు చిందించారు. ఆయన తన ఉపాధ్యక్ష సహచరుడిగా ఉంటారని ట్రంప్ సూచనప్రాయంగా వెల్లడించారు.

రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడిన వివేక్‌(Vivek Ramaswamy).. తొలి ప్రైమరీ పోరులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆ ఎన్నికల్లో ఆయనకు కేవలం 7.7 శాతం ఓట్లు వచ్చాయి. 51 శాతం ఓటింగ్‌తో  అయోవా చరిత్రలో ట్రంప్‌ ఎన్నడూ లేనంత మెజారిటీని దక్కించుకున్నారు. ఇతర అభ్యర్థులు ఆయన దరిదాపుల్లో కూడా లేరు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని