Ukraine-Russia: ఉక్రెయిన్‌ స్నైపర్‌.. 3.8 కి.మీల దూరం నుంచే రష్యా సైనికుడి కాల్చివేత!

Ukraine-Russia: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో స్నైపర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ రష్యన్‌ సైనికుడిని ఉక్రెయిన్‌ షార్ప్‌ షూటర్‌ 3.8 కిలోమీటర్ల దూరం నుంచే కాల్చివేసినట్లు తెలుస్తోంది.

Updated : 20 Nov 2023 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సైనిక చర్య’ పేరుతో తమ భూభాగంలోకి అడుగుపెట్టిన రష్యా (Russia) దళాలతో దాదాపు ఏడాదిన్నరకు పైగా ఉక్రెయిన్‌ (Ukraine) సైన్యం పోరు సాగిస్తోంది. యుద్ధంలో భాగంగా తాజాగా ఓ ఉక్రెయిన్‌ స్నైపర్‌ (షార్ప్‌ షూటర్‌).. చాలా దూరం నుంచే రష్యా సైనికుడి (Russian soldier)ని కాల్చివేసినట్లు తెలుస్తోంది. ఏకంగా రెండున్నర మైళ్ల దూరం నుంచి ఈ స్నైపర్‌ (Ukrainian sniper) షూటింగ్‌ జరిపినట్లు ఉక్రెయిన్‌ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ విభాగానికి చెందిన ఓ స్నైపర్‌.. 3.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా సైనికుడిని కాల్చి చంపినట్లు ఆ విభాగం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ క్రమంలోనే షార్ప్‌ షూటింగ్‌లో అతడు ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు ఉక్రెయిన్‌ మీడియాకు తెలిపింది. గతంలో 2017లో కెనడియన్‌ స్పెషల్‌ ఫోర్సెస్‌కు చెందిన ఓ స్నైపర్‌.. ఇరాక్‌లో 3.54 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువును కాల్చి చంపాడు. అంతకుముందు, 2009లో ఓ బ్రిటిష్‌ స్నైపర్‌.. అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ ఫైటర్‌ను రెండున్నర కిలో మీటర్ల దూరం నుంచి చంపేశాడు. ఇప్పుడీ రికార్డులను ఉక్రెయిన్‌ స్నైపర్‌ అధిగమించినట్లు ఉక్రెయిన్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

అల్‌-షిఫాలో బందీలను దాచిన హమాస్‌.. ఫొటోలు విడుదల చేసిన ఐడీఎఫ్‌

2022 ఫిబ్రవరిలో సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరువైపులా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని