Warangal: ట్రాఫిక్‌లో చిక్కుకున్న వరుడు.. ఆ తర్వాత పరిస్థితి చూడండి!

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో.. ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో మూడు భారీ క్రేన్‌లతో ఆయిల్ ట్యాంకర్ తొలగించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రహదారిపై రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్ నుంచి తొర్రూర్‌కు వెళ్తున్న ఓ వరుడి కారు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఉదయం 10 గంటలకు తన వివాహ ముహూర్తం ఉండడంతో ముహూర్తం దాటిపోతోందని.. త్వరగా ట్రాఫిక్ క్లియర్ చేసి తనను పంపించాలని కారు దిగి అధికారులతో వరుడు మొరపెట్టుకున్నారు.

Updated : 07 Sep 2023 13:19 IST

Tags :

మరిన్ని