Rajamahendravaram: రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానంలో కూటమిదే పాగా..!

గోదావరి తీరానికి పక్కనే ఉండే రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి.. ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో ప్రముఖులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి బరిలో నిలిచారు. ఈ పరిస్థితుల్లో రాజమండ్రి పార్లమెంట్‌వాసులు కూటమికి జై కొట్టేందుకు సిద్ధమయ్యారు.

Published : 02 May 2024 19:18 IST

గోదావరి తీరానికి పక్కనే ఉండే రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి.. ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో ప్రముఖులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైకాపా గెలిచింది. ఈసారి తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి బరిలో నిలిచారు. వైకాపా తరపున ఈసారి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. వైకాపా పాలనలో పార్లమెంట్ పరిధిలో ఐదేళ్లు రైతులకు తీవ్ర కష్టనష్టాలు తప్పలేదు. అభివృద్ధి పడకేసింది. ఇసుక, గ్రావెల్ దోపిడీ, వరద నీటితో మునిగిపోయే ఆవ భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ధ్వంసమైన రహదారులకు కనీస మరమ్మతులు చేయకపోవడం, రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్‌ల ఆగడాలు, గోదావరి ప్రతిష్ఠాత్మక వంతెనల అస్తవ్యస్త నిర్వహణతో ప్రజలకు అవస్థలు తప్పలేదు. ఈ పరిస్థితుల్లో రాజమండ్రి పార్లమెంట్‌వాసులు కూటమికి జై కొట్టేందుకు సిద్ధమయ్యారు.

Tags :

మరిన్ని