Mancherial: లైట్ బీర్లు అమ్మడం లేదని మంచిర్యాల యువకుడి వినూత్న నిరసన

లైట్ బీర్లు అమ్మడం లేదని మంచిర్యాల జిల్లా యువకుడు వినూత్నంగా నిరసన చేపట్టాడు. తరుణ్ అనే యువకుడు మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా నుంచి అబ్కారీ శాఖ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లాడు.

Updated : 29 Apr 2024 19:42 IST

లైట్ బీర్లు అమ్మడం లేదని మంచిర్యాల జిల్లా యువకుడు వినూత్నంగా నిరసన చేపట్టాడు. తరుణ్ అనే యువకుడు మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా నుంచి అబ్కారీ శాఖ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లాడు. అబ్కారీ శాఖ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేశాడు. 20 రోజులుగా మద్యం దుకాణాల్లో లైట్ బీర్ల అమ్మకాలు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తిరిగి వాటి అమ్మకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Tags :

మరిన్ని