Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
వచ్చే నెలలో తాత్కాలిక జాబితా?
మార్చినాటికి ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తికి యోచన
ఈనాడు - హైదరాబాద్‌
రాష్ట్ర స్థాయి పోస్టుల్లోని ఉద్యోగులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కేటాయిస్తూ తాత్కాలిక జాబితా డిసెంబరు నెలలో వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల నుంచి ఈనెల రెండు లేదా మూడో వారంలో ఆప్షన్లను స్వీకరించి ఆ తర్వాత తాత్కాలిక జాబితాలను తయారు చేస్తారు. దీనిపై వచ్చే వినతులను పరిశీలించాక కేంద్రం తుది జాబితాను వెల్లడిస్తుంది. ఈ ప్రక్రియనంతటినీ 2015, మార్చినెలాఖరులోగా పూర్తిచేయాలని కమలనాథన్‌ నేతృత్వంలోని సలహా సంఘం భావిస్తున్నట్లు సమాచారం. ఉభయ రాష్ట్రాల హెచ్‌వోడీలు (శాఖాధిపతుల కార్యాలయాలు), సచివాలయ శాఖల నుంచి ఉద్యోగుల సమగ్ర వివరాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి విభజన ప్రక్రియ వూపందుకోనుంది. వివరాలు వచ్చాక ఆప్షన్లు తెలియజేయాల్సిందిగా కమలనాథన్‌ కమిటీ ప్రకటిస్తుంది. ఈ ప్రకటన నవంబరు రెండు లేదా మూడో వారంలో వెలువడవచ్చని సమాచారం. ఆప్షన్లు పంపుకోవటానికి రెండు వారాల గడువు ఉంటుంది. ఆప్షన్లను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు జాబితాను వెల్లడిస్తారు. ఇది డిసెంబరు నెలలో వెలువడవచ్చని తెలుస్తోంది. ఇది వెల్లడయ్యాక రాష్ట్ర స్థాయి ఉద్యోగులందరికీ తమను ఏ రాష్ట్రానికి కేటాయించిందీ తెలుస్తుంది. తాను కోరుకొన్న రాష్ట్రాన్ని ఇవ్వలేదని భావించేవారు తమ వినతిని తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి పంపుకోవచ్చు. ఇలా అందజేయటానికి రెండు వారాల గడువు ఇస్తారు. దాని కాపీ, సంబంధిత శాఖ వ్యాఖ్యలతో సహా ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ శాఖ సలహా సంఘానికి తన సిఫార్సులను తెలియజేస్తుంది. సలహా సంఘం ఉభయ రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమై ఉద్యోగి వినతిపైన, దానికి సంబంధించి పునర్‌వ్యవస్థీకరణ శాఖ నుంచి వచ్చిన సిఫార్సులపైనా చర్చిస్తుంది. అనంతరం తన సిఫార్సులను కేంద్రానికి తెలియజేస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల తుది కేటాయింపు జాబితాను వెల్లడిస్తుంది. ఆప్షన్ల తర్వాత ఇన్ని దశలు ఉన్నందునే తుది జాబితా మార్చి నెలలో వెలువడవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అప్పటికి కమలనాథన్‌ కమిటీ ఏర్పాటై ఏడాది పూర్తవుతుంది.

ప్రస్తుత పరిస్థితి ఇదీ: తుది కేటాయింపు జాబితా మార్చినెలలో వెలువడాలంటే ఉద్యోగుల సమగ్ర సమాచారం వెంటనే అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అతి ముఖ్యమైన ఈ ఉద్యోగుల సమాచారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. విభజనకు కావాల్సిన రీతిలో హెచ్‌వోడీలు, సచివాలయ శాఖలు సమాచారాన్ని అందజేయటం ఆలస్యమైతే కేటాయింపు జాబితా తయారీ కూడా ఆలస్యం అవుతుందని అధికార వర్గాలు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో సమాచారాన్ని ఇవ్వని హెచ్‌వోడీ కార్యాలయాలను గుర్తించి వాటి వద్ద ఆందోళనలను నిర్వహించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస తాజాగా తీర్మానించాల్సి వచ్చింది.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net