
తెలంగాణ
వెంగళ్రావునగర్, న్యూస్‌టుడే: విద్యుత్తు పంపిణీ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని.. ఇదే విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సైతం ప్రకటించారని జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారమిక్కడ విద్యుత్తు అకౌంట్స్ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్తు సంస్థలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించి జాతీయస్థాయిలో కీర్తి గడించాయన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘాలతో కలిసి సీఎం కేసీఆర్‌ను త్వరలో కలుస్తామన్నారు. విద్యుత్తు అకౌంట్స్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్, అంజయ్య, ఎస్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు మాట్లాడారు.