Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
డేవిస్‌కప్‌ సెమీస్‌లో జర్మనీ

ఇన్స్‌బ్రక్‌: జర్మనీ టెన్నిస్‌ జట్టు అదరగొట్టింది. డేవిస్‌ కప్‌లో అద్భుత ప్రదర్శనతో 2007 తర్వాత తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో జర్మనీ 2-1 తేడాతో బ్రిటన్‌పై పోరాడి గెలిచింది. తొలి సింగిల్స్‌లో ఎవాన్స్‌ 6-2, 6-1తో పీటర్‌పై నెగ్గి బ్రిటన్‌కు శుభారంభం అందించాడు. ఒక మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. మరో పోరులో పరాజయం పాలైతే ఇంటిముఖం పట్టాల్సి వస్తుందనే దశలో జర్మనీ గొప్ప ఆటతీరు ప్రదర్శించింది. రెండో సింగిల్స్‌లో స్ట్రాఫ్‌ 7-6 (8-6), 3-6, 6-2తో నోరీని ఓడించి జర్మనీ ఆశలు నిలిపాడు. ఇక నిర్ణయాత్మక డబుల్స్‌ మ్యాచ్‌లో కెవిన్‌- టిమ్‌ జోడీ 7-6 (12-10), 7-6 (7-5)తో జోయ్‌- నీల్‌పై పోరాడి గెలిచింది. కీలక పోరులో రెండు జంటలు విజయం కోసం ప్రాణం పెట్టి తలపడ్డాయి. హోరాహోరీగా సాగి టైబ్రేకర్‌కు దారి తీసిన తొలి సెట్‌లో గెలుపు జర్మనీకే దక్కింది. తొలి సెట్‌ మాదిరే సాగిన రెండో సెట్‌లో.. ముఖ్యంగా టైబ్రేకర్‌లో 0-5తో వెనకబడ్డ దశ నుంచి వరుసగా ఏడు పాయింట్లు నెగ్గిన జర్మనీ జోడీ తమ దేశానికి విజయాన్ని అందించింది.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.