
ప్రతికూల మార్కులను అధిగమించడం కోసం...
నైపుణ్యాల గెలుపు సూత్రం
ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షల ద్వారా అభ్యర్థుల యోగ్యతను నిర్ధారించే పద్ధతిని తొలిసారిగా చైనా ప్రవేశపెట్టింది. భారత్లో ఉద్యోగ నియామకాలకు, ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు జరిగే పోటీ పరీక్షలకు కొన్ని ఎంపిక సంస్థలు నెగెటివ్ మార్కుల పద్ధతిని అమలు చేస్తున్నాయి. ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)’ ఈ పద్ధతిని దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టింది. బ్యాంకు ఉద్యోగాల నియామకాల్లోనూ ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ఇందులో ప్రతి ప్రశ్నకు బహుళ సమాధానాలు ఉంటాయి. అభ్యర్థులు కచ్చితమైన సమాధానాన్ని గుర్తించాలి. యూపీఎస్సీ ఏటా వందల సంఖ్యలో భర్తీ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. కమిషన్ నెగెటివ్ మార్కుల పద్ధతి ద్వారా ప్రాథమిక పరీక్ష నిర్వహించి వేల సంఖ్యలో అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కొన్ని ఉద్యోగ నియామకాల్లో సైతం ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్.ఐ., కానిస్టేబుళ్ల నియామకాలకు దాదాపు 12 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో- ఎంపిక పరీక్షలో నెగెటివ్ మార్కుల పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు.
అభ్యర్థులు గుర్తించే తప్పు సమాధానాలను లెక్కకట్టి- వారి మొత్తం మార్కుల నుంచి తొలగించి ర్యాంకును నిర్ధారించడమే నెగెటివ్ మార్కుల విధానం. పోటీ పరీక్షలన్నింటికీ నెగెటివ్ మార్కులు ఒకే తరహాలో ఉండవు. ఎన్ని తప్పు సమాధానాలకు ఒక మార్కు తగ్గించాలనేదీ సంబంధిత ఎంపిక బోర్డు నిర్ణయిస్తుంది. నిరుద్యోగ సమస్య తీవ్రత కారణంగా- ఉద్యోగాల నియామకానికి అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో హేతుబద్ధ ఎంపికకోసం ఆయాసంస్థలు ఈ పద్ధతిని అమలుపరచడం అనివార్యంగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలైన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా వంటివి ఈ విధానాన్ని అనుసరించడం లేదు. ఈ పద్ధతిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పరీక్షలో ఊహించి సమాధానాలను రాయడాన్ని నిరోధించి- అభ్యర్థులు పొందిన మార్కులకు విలువను కల్పించడానికి, సక్రమంగా పరీక్షకు సిద్ధం కానివారిని తొలగించడానికి ఈ పద్ధతి ఉపకరిస్తుంది. కేవలం పరిపూర్ణ జ్ఞానం, తెలివితేటలు కలిగిన వారిని మాత్రమే ఎంపిక చేయడానికి ఇది దోహదపడుతుంది. ఉద్యోగ నియామకాల్లో సమానత్వం, నిష్పాక్షికత, న్యాయ సూత్రాలకు ఈ తరహా పరీక్షలు విరుద్ధమని విమర్శకుల అభిప్రాయం. ప్రత్యేక శిక్షణ పొందిన అభ్యర్థులకు మాత్రమే ఇది అనుకూలమైనది. ఆర్థిక కారణాలవల్ల అభ్యర్థులందరూ ప్రత్యేక శిక్షణ పొందడానికి వీలు కాదు. విద్యార్థుల్లో సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని తగ్గించి, వారు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొనలేని పరిస్థితిని కల్పిస్తుందని మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అభ్యర్థుల మేధా ప్రగతికి, తెలివిగా సమాధానాలను ఊహించడానికి ఈ పద్ధతి అవరోధమని గతంలో తమిళనాడు హైకోర్టు అభిప్రాయపడింది. ఊహించడం రెండు రకాలు. చదివిన విషయాల ఆధారంతో తెలివిగా ఊహించడం. ఏ విధమైన ఆధారం లేకుండా ఇష్టప్రకారం ఊహించడం. వ్యక్తులు కేవలం విషయ పరిజ్ఞానంతోనే కాకుండా, తెలివిగా ఊహించీ విజయం సాధిస్తారని న్యాయస్థానం వెల్లడించింది. సమాధానాల ఎంపికలో సందిగ్ధం ఎదురైతే అధ్యయన జ్ఞానంతో ఊహించి సమాధానాలు రాసేవారిని శిక్షించడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. అభ్యర్థుల జ్ఞానాన్ని, తెలివిని విశ్లేషించేందుకు నెగెటివ్ మార్కుల పద్ధతి ఏ విధంగానూ సహాయపడదనీ అభిప్రాయపడింది. ఈ పద్ధతి ద్వారా అభ్యర్థుల్లో నిరుత్సాహం, పరీక్షల పట్ల విముఖత పెరుగుతాయి. అందుకే ఈ విధానాన్ని తొలగించడాన్ని పరిశీలించాలని ‘జాతీయ పరీక్షల మండలి’కి తమిళనాడు హైకోర్టు 2019లో ఆదేశాలను జారీ చేసింది. ప్రతికూల మార్కుల విధానంలో పరీక్షలు రాసేందుకు విషయ పరిజ్ఞానంతో పాటు అభ్యర్థులు నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. తీవ్ర అభ్యాసం ద్వారా మాత్రమే నైపుణ్యం సాధ్యపడుతుంది. పాఠ్యాంశాలపై పూర్తి పరిజ్ఞానం, పట్టు ఉండాలి. ప్రశ్నలను, సమాధానాలను రెండు మూడు సార్లు చదివి అడిగిన అంశాన్ని, అంతర్లీన సంబంధాన్ని అర్థం చేసుకొని సమాధానాలను గుర్తించాలి. సమాధానాలు తెలియని ప్రశ్నలను వదిలివేయడం ఉత్తమం. గత పరీక్షల ప్రశ్న పత్రాలను పరిశీలించి, ప్రశ్నలు అడిగే రీతిని, ఏ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయాలను గుర్తించాలి. దానివల్ల పరీక్ష భయం, ఒత్తిడి కొంత తగ్గుతాయి. సామర్థ్య స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని, లోపాలను సరిదిద్దుకోవాలి. నెగెటివ్ మార్కుల విధానంలో అభ్యర్థులు సమూహంగా ఏర్పడి పరీక్షలకు సంసిద్ధం కావడం ద్వారా విజయ సాధన సులభతరమవుతుంది.
- డాక్టర్ సీహెచ్సీ ప్రసాద్
(విద్యారంగ నిపుణులు)
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi Sanjay: డ్వాక్రా గ్రూపులను తెరాస నిర్వీర్యం చేసింది: బండి సంజయ్
-
Movies News
Raksha Bandhan: రాఖీ స్పెషల్.. సెలబ్రిటీలు ఎలా జరుపుకొన్నారంటే..?
-
Movies News
Vijay Deverakonda: అభిమానుల అత్యుత్సాహం.. నిమిషాల్లో మాల్ వదిలి వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ
-
General News
KTR: యువత ఒత్తిడిని అధిగమించి ముందుకెళ్లాలి: కేటీఆర్
-
Sports News
Virender Sehwag: పాక్ రాజకీయ విశ్లేషకుడికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన సెహ్వాగ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- AP Govt: మరో బాదుడు
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ