
మధ్యాహ్న భోజనం తయారీకిచ్చే మొత్తం పెంపు..
రెండేళ్ల తర్వాత 9.60 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం!
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యార్థులకు ‘మధ్యాహ్న భోజనం’ తయారీలో వంట ఏజెన్సీలకు అందజేసే మొత్తం పెరగనుంది. కొన్నేళ్లుగా ఏటా దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏడు శాతం వంతున పెంచుతోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆ మాటెత్తలేదు. మరోవంక.. ధరల మంట నేపథ్యంలో వివిధ తరగతుల విద్యార్థులకు భోజనం తయారీకి ప్రభుత్వాలు చెల్లించే ధరను పెంచాలని వంట ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ కొద్ది నెలల క్రితం నివేదికను సమర్పించింది. ఎన్ఐఎన్ మాత్రం 1-5 తరగతుల విద్యార్థులకు రూ.10లు, ఇతరులకు రూ.12లకు పెంచాలని సిఫారసు చేసినట్లు సమాచారం. మొత్తానికి 20 శాతం వరకు పెంచవచ్చని విద్యాశాఖ అధికారులకు సమాచారం ఉంది. అందుకు భిన్నంగా ఇప్పుడు చెల్లిస్తున్న ధరలపై 9.6 శాతం పెంచేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈ మొత్తంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా భరిస్తాయి.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
CM Jagan: నెల్లూరు జిల్లా వైకాపాలో ముసలంపై సీఎం జగన్ దృష్టి
-
Movies News
Social Look: ‘ఫర్జీ’ కోసం రాశీఖన్నా వెయిటింగ్.. శివాత్మిక లవ్ సింబల్!
-
Sports News
Team India: భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్లు వారే: కుంబ్లే
-
Sports News
SKY: క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ప్రశాంతంగా ఉండటం అలా వచ్చిందే..: సూర్యకుమార్
-
Politics News
KTR: పీఎం కేర్స్పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
-
Sports News
IND vs NZ: ఉమ్రాన్ ఇంకా నేర్చుకోవాలి.. మణికట్టు మాంత్రికుడు ఉండాల్సిందే: వసీమ్ జాఫర్