ఇళ్ల వద్దకే వైద్యసేవలు - Apollo 247 Medical services in collaboration with airtel
close

Published : 06/04/2021 10:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇళ్ల వద్దకే వైద్యసేవలు

అపోలో 24/7, ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యం

ఈనాడు, హైదరాబాద్‌: అపోలో హాస్పిటల్స్‌కు చెందిన హెల్త్‌కేర్‌ మొబైల్‌ యాప్‌ అపోలో 24/7, టెలికామ్‌ సేవల సంస్థ ఎయిర్‌టెల్‌తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు కలిసి ఇ-హెల్త్‌కేర్‌ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించాయి. వైద్యుల ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ సేవల నుంచి డయాగ్నస్టిక్స్‌, ఫార్మసీ, వెల్‌నెస్‌ సేవలు అపోలో 24/7 హెల్త్‌కేర్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా లభిస్తాయి. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ ద్వారా ఈ సేవలను వినియోగించుకునే వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. ఎయిర్‌టెల్‌ ప్రీమియర్‌ వినియోగదార్లకు, 12 నెలల పాటు ‘అపోలో సర్కిల్‌’ సభ్యత్వం లభిస్తుంది. ఎయిర్‌టెల్‌ గోల్డ్‌ వినియోగదార్లకు 3 నెలల పాటు సభ్యత్వం లభిస్తుంది. డిజిటల్‌ హెల్త్‌ సేవల విస్తరణకు ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం ఉపకరిస్తుందని అపోలో 24/7 సీఈఓ ఆంథోనీ జాకబ్‌ పేర్కొన్నారు. అపోలోతో కలిసి వైద్య సేవలను ప్రజలకు వారి ఇళ్లవద్దే అందించనున్నామని ఎయిర్‌టెల్‌ ముఖ్య మార్కెటింగ్‌ అధికారి శాశ్వత్‌ శర్మ వివరించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని