Andhra news: సీఎస్‌ జవహర్‌రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ

డీబీటీ పథకాలకు సంబంధించి సీఎస్‌ జవహర్‌రెడ్డి ఇచ్చిన వివరణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.

Published : 10 May 2024 19:51 IST

అమరావతి: డీబీటీ పథకాలకు సంబంధించి సీఎస్‌ జవహర్‌రెడ్డి ఇచ్చిన వివరణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. జనవరి, మార్చి మధ్య ఆర్థిక పరిస్థితి బాగున్నా నిధులు అందుబాటులో ఉంచలేదు.. నిధులు జమచేయకుండా దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచడం సరికాదని తెలిపింది. మే నెలలో ఎప్పుడూ డీబీటీ పథకాలకు నిధులు విడుదల చేయలేదని పేర్కొంది. పోలింగ్‌ తేదీకి ముందు జమ చేయాల్సిన అత్యవసర పరిస్థితి లేదు.. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎప్పుడైనా నిధులు జమ చేసేందుకు అభ్యంతరం లేదని ఈసీ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు