Stock market: వరుసగా మూడోరోజూ నష్టపోయిన సూచీలు - Sensex falls over 300 pts
close

Published : 21/10/2021 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: వరుసగా మూడోరోజూ నష్టపోయిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో వరుసగా మూడో రోజూ సూచీలు నష్టపోయాయి. దీంతో సెన్సెక్స్‌ 61 వేల పాయింట్లు దిగువన ముగియగా.. నిఫ్టీ 18,200 మార్కును కోల్పోయింది.

ఉదయం 61,526 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా అదే ఒరవడిని కొనసాగింది. చివరికి 336.46 పాయింట్లు నష్టపోయి 60,923.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 88.46 పాయింట్లు నష్టపోయి 18,178.10 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఏషియన్‌ పెయింట్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, డాకక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ప్రధానంగా నష్టపోయాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, ఆటో, ఆయిల్‌, గ్యాస్‌, పవర్‌ సెక్టార్‌ షేర్లు లాభపడగా.. మెటల్, ఐటీ, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టాలు చవిచూశాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని