Stock market: నష్టాల్లో సూచీలు - Stock markets are in red
close

Published : 09/07/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: నష్టాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. పలు దేశాల్లో కొవిడ్‌-19 డెల్టా వేరియంట్‌ కేసులు పెరగడంతో పాటు రేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్‌ రిజర్వు వ్యాఖ్యలు అంతర్జాతీయ సూచీలను కలవరపెడుతున్నాయి. వీటికి తోడు బాండ్ల రాబడులు పెరగడం సూచీల నేలచూపులకు కారణమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 305 పాయింట్ల నష్టంతో 52,263 వద్ద.. నిఫ్టీ 77 పాయింట్లు దిగజారి 15,650 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.72 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో టాటా స్టీల్‌, డాక్టర్ రెడ్డీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, టైటన్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని