వాల్ట్‌ డిస్నీ భారతీయ విభాగం చీఫ్‌గా మాధవన్‌ - Walt Disney names K Madhavan as India unit chief
close

Published : 14/04/2021 23:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాల్ట్‌ డిస్నీ భారతీయ విభాగం చీఫ్‌గా మాధవన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ : వాల్ట్‌డిస్నీ భారతీయ విభాగం అధ్యక్షుడిగా కె.మాధవన్‌ పేరును ప్రకటించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది. గతంలో ఆయన స్టార్‌, డిస్నీ ఇండియాకు మేనేజర్‌గా వ్యవహరించారు. ఆయన తాజాగా ఉదయ్‌ శంకర్‌ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త బాధ్యతల్లో మాధవన్‌‌ భారత్‌లో వాల్ట్‌డిస్నీ, స్టార్‌ ఇండియా వృద్ధి వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. భారత్‌లో కంపెనీకి ఉన్న మిగిలిన వ్యాపారాలను కూడా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. వీటిలో వినోద, క్రీడలు,ప్రాంతీయ ఛానెల్స్‌,  డైరెక్ట్‌ టూ కస్టమర్ తదితర సేవలు‌ ఉన్నాయని కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మాధవన్‌ 2009లో స్టార్‌ ఇండియా దక్షిణ భారత విభాగం హెడ్‌గా చేరారు. ఆ తర్వాత 2019లో స్టార్‌, డిస్నీ ఇండియా జాతీయ స్థాయి మేనేజర్‌గా ఎదిగారు. 

‘‘నేను గత కొన్ని నెలలుగా కె.మాధవన్‌తో కలిసి పనిచేస్తున్నాను. ఆయన మా భారతీయ విభాగం వ్యాపారాలను ఎలా నిర్వహిస్తారన్నది ప్రత్యక్షంగా తెలుసుకోవడం సంతోషంగా ఉంది. ఈ విభాగం మా గ్లోబల్‌, ప్రాంతీయ వ్యూహాల్లో అత్యంత కీలకమైంది. ఆయన మా స్టార్‌నెట్‌వర్క్‌, లోకల్‌ కంటెంట్‌ వ్యాపారాలను కొత్త శిఖరాలకు చేరుస్తారు’’ అని వాల్ట్‌ డిస్నీ డైరెక్ట్‌ టూ కస్టమర్‌ అంతర్జాతీయ విభాగానికి ఛైర్మన్‌ రెబెక్కా క్యాంప్‌బెల్‌ తెలిపారు.  

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని