close

Updated : 08/04/2021 15:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి: తీవ్ర ఒడుదొడుకుల్లో దేశీయ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో క్రితం సెషన్‌లో భారీ లాభాలు గడించిన మార్కెట్లు.. ఈ ఉదయం కూడా అదే ఉత్సాహంతో మొదలయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభంతో దూసుకెళ్లింది. 

అయితే ఆ జోరు ఎంతోసేపు కొనసాగలేదు. మధ్యాహ్నం తర్వాత కీలక రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒత్తిడికి గురైన సూచీలు ఆరంభ లాభాల్లో చాలా వరకు కోల్పోయాయి. ఒక దశలో నష్టాల్లో ట్రేడ్‌ అయిన సూచీలు చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నేటి సెషన్‌లో సెన్సెక్స్‌ 84.45 పాయింట్ల లాభంతో 49,746.21 వద్ద, నిఫ్టీ 54.80 పాయింట్ల లాభంతో 14,873.80 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.60గా కొనసాగుతోంది. 

ఎన్‌ఎస్‌ఈలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, శ్రీ సిమెంట్‌, టైటాన్‌, హిందాల్కో షేర్లు లాభపడగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఓఎన్జీసీ షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా.. లోహ, ఇన్‌ఫ్రా, ఐటీ షేర్లు రాణించాయి. 

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని