తీవ్ర జీవనోపాధి సంక్షోభం దిశగా భారత్‌!
close

Published : 12/05/2021 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తీవ్ర జీవనోపాధి సంక్షోభం దిశగా భారత్‌!

ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌ అంచనా

దిల్లీ: భారత్‌లో పరిస్థితి ఈ సారి అధ్వానంగా మారుతున్నట్లుగా కనిపిస్తోందని.. ‘తీవ్ర జీవనోపాధి సంక్షోభం’ దిశగా దేశం వెళ్లే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌ అభిప్రాయపడ్డారు. కరోనా మలి విడత నేపథ్యంలో రాష్ట్రాలు స్థానిక నిబంధనలను కఠినతరం చేస్తుండడంతో దాదాపు జాతీయ లాక్‌డౌన్‌ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయని పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2024-25 కల్లా భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరబోదని కుండబద్దలు కొట్టారు. గతేడాదితో పోలిస్తే పరిస్థితిలో పెద్దగా తేడాలేదని.. ఉద్యోగులపై ప్రభావం కనిపిస్తోందని అన్నారు. కరోనా వ్యాప్తి భారీగా ఉందని.. ఇది ఆర్థిక కార్యకలాపాల రికవరీని క్లిష్టతరం చేయొచ్చని ఆయన అన్నారు. టీకా భారీ స్థాయిలో ఇచ్చినా.. దీర్ఘకాలం పాటు  పలు సమస్యలు కొనసాగే అవకాశం ఉందన్నారు. ‘చాలా మంది ప్రజలు తాము కూడబెట్టుకున్న సొమ్ము కోల్పోయి..భారీ అప్పుల్లో కూరుకుపోయారు. గతేడాది ప్రభుత్వం పలు ఊరట చర్యలు ప్రకటించింది. ఈ సారి అసలు చర్చలో కూడా అవి లేవు. కేసులు లక్షల్లో నమోదవుతున్నా.. ప్రభుత్వం మాత్రం ‘కమ్యూనిటీ వ్యాప్తి’ ఉందని అంగీకరించలేదు. ఇది ఆరోగ్య సేవలు కుదేలవడానికి దారి తీసింది. ఒక సంక్షోభాన్ని అంగీకరించకపోతే అది మరింత అధ్వానంగా తయారవుతుంది. ఇపుడు అందుకు మూల్యం చెల్లిస్తున్నామ’ని ఆయన చెప్పుకొచ్చారు. ‘ప్రస్తుత పథకాలతో పోలిస్తే నగదు బదిలీ పథకాలతో ఒక సరైన ప్రణాళికలను రూపుదిద్దడం ముఖ్యమ’ని డ్రెజ్‌ అభిప్రాయపడ్డారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని